Venkaiah Naidu: ప్రజాస్వామ్య రాజకీయాలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
‘‘దేశ యువత ఉత్సాహంతో ఉత్తేజంతో ఉండాలి. యువతే దేశానికి అసలైన సంపద. యువత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. యువత రాజకీయాల్లోకి రావాలి. అమెరికా, రష్యా, బ్రిటన్ అభివృద్ధిలో భారతీయుల పాత్ర చాలా ఉంది’’ అని అన్నారు. ఇక ప్రజాస్వామ్య విషయమై ఆయన మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో పార్టీలు మారడం మంచి పద్దతి కాదు

Defection is not a good practice in a democracy says Venkaiah Naidu
Venkaiah Naidu: ప్రజాస్వామ్య రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు మంచి పద్దతి కాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అలాగే రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు పోవడం, కులమతాల ఆధారంగా నాయకులను ఎన్నుకోవడం సరైన పద్దతి కాదని ఆయన అన్నారు. గురువారం గుంటూరులోని విజ్ణాన్ వర్సిటీలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి వెంకయ్యనాయుడు హాజరై మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
‘‘దేశ యువత ఉత్సాహంతో ఉత్తేజంతో ఉండాలి. యువతే దేశానికి అసలైన సంపద. యువత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. యువత రాజకీయాల్లోకి రావాలి. అమెరికా, రష్యా, బ్రిటన్ అభివృద్ధిలో భారతీయుల పాత్ర చాలా ఉంది’’ అని అన్నారు. ఇక ప్రజాస్వామ్య విషయమై ఆయన మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో పార్టీలు మారడం మంచి పద్దతి కాదు. అలాగే రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు పోవడం, కులమతాల ఆధారంగా నాయకులను ఎన్నుకోవడం సరైన పద్దతి కాదు’’ అని అన్నారు.
ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వెంకయ్య ప్రశంసలు కురిపించారు. ప్రపంచం అంతా భారత్ వైపు చూడడానికి ప్రధాని మోదీయే కారణమని అన్నారు. నేడు భారత్తో స్నేహం చేయడానికి అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయని, దానికి కారణం మోదీయేనని అన్నారు. దేశాన్ని ప్రపంచంలో మేటిగా నిలబెట్టిన ఘనత మోదీకే దక్కుతుందని వెంకయ్య అన్నారు.
Bilkis Bano case: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు