కియా.. ఆంధ్రా నుంచి తమిళనాడుకు వెళ్లిపోతుందా?

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తరిలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రా నుంచి 1.1 బిలియన్ల విలువైన కియా ప్లాంట్‌ను తరలించే సాధ్యాసాధ్యాలపై తమిళనాడుతో చర్చలు జరుగుతున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. గత ఏడాదిలో పాలసీ విధానాల్లో మార్పులతో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఏపీలో కొన్నినెలల్లోనే తమిళనాడుకు తరిలిపోతుందంటూ రాయిటర్స్ కథనంలోని సారాంశం..
అయితే, కియా మోటార్స్ పై రాయిటర్స్ కథనం పూర్తిగా అవాస్తవమని, అసత్యాలతో కూడిన కథనమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ తీవ్రంగా ఖండించారు. కియా, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని ఈ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రజిత్ అన్నారు.
ప్రపంచంలో ఐదో అతిపెద్ద కారు మార్కెట్ ఉన్న సంస్థ కియో.. ఏపీలో తొలి ప్లాంట్ ప్రారంభించింది. రెండేళ్ల నిర్మాణ పనుల అనంతరం గత ఏడాది డిసెంబర్ నెలలోనే ఈ ప్లాంట్ నెలకొల్పింది. దీని వార్షిక కెపాసిటీ 3లక్షల యూనిట్లు కాగా, మొత్తంగా 12వేల ఉద్యోగాలను కల్పించింది.
మరోవైపు.. కియో ఒక ప్రకటనలో ‘ప్రస్తుత లొకేషన్ నుంచి మరో ప్రాంతానికి ప్లాంట్ తరలించడానికి ఎలాంటి ప్రణాళికలు లేవు. ఇతర ఏ పాలసీకి సంబంధించి లేదా తమిళనాడుతో చర్చలు లేవు’ అని స్పష్టం చేసింది. కాగా, కియా మోటార్స్ పై రాయిటర్స్, లైవ్ మింట్ కథనాలను ఏపీ ప్రభుత్వం ఖండించింది.