లక్ష్యం ఒక్కటే : జగన్‌ను మరోసారి సీఎంగా చేయాలి

తమ లక్ష్యం ఒక్కటే..జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలి..ఇందుకు తాము అంతా కృషి చేస్తామన్నారు వైసీపీ నేత దేవినేని అవినాశ్. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతామని, జిల్లాలో, నియోజకవర్గంలో అందరితో కలిసిమెలిసి పనిచేస్తామని వెల్లడించారు. 2019, నవంబర్ 21వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురాలని, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకొనే విధంగా తాము పనిచేయడం జరుగుతుందన్నారు. వైసీపీ పార్టీలో వచ్చిన కార్యకర్తలకు, నేతలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. మంత్రులో, స్థానిక నాయకత్వంలో కలిసి పనిచేస్తామన్నారు. తమకు సహకరించిన వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతరులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు.
దేవినేని నెహ్రు వారసుడిగా రాజకీయ అరగేంట్రం చేసిన దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి ఇటీవలే గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీకి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అవినాష్, తన రాజీనామా లేఖను తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయానికి పంపారు. అవినాష్ అంతకుముందు కాంగ్రెస్ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. 2014లో కోడాలి నానీ మీద పోటీ చేసి గుడివాడలో ఓడిపోయారు.
Read More : ప్రపంచ మత్స్యకార దినోత్సవం : తూర్పుగోదావరిలో సీఎం జగన్ టూర్