DGP Rajendranath Reddy : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

దొంగతనాలను అరికట్టడానికి ప్రత్యేకంగా క్రైం టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇద్దరు డీఐజీలు నిరంతరాయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని తెలిపారు.

DGP Rajendranath Reddy : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

DGP Rajendranath Reddy (1)

Updated On : September 17, 2023 / 12:19 AM IST

DGP Rajendranath Reddy Srivari Brahmotsavam : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 6 మంది ఎస్పీలు సహా 4900 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్ది పెరిగితే తిరుపతిలోనే ట్రాఫిక్ నియంత్రణ చేస్తామని చెప్పారు. తిరుపతిలో మూడు ప్రాంతాలలో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూన్నామని తెలిపారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై శనివారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఐజీలు రాజశేఖర్ బాబు, రవిప్రకాష్, ఎస్పీలు పరమేశ్వర్ రెడ్డి, తిరుమలేశ్వర రెడ్డి, సివియస్ఓ నరసింహ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ నాలుగు మాడ వీధులలో ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు చేతికర్రలు.. నడకమార్గంలో పంపిణీ చేస్తున్న టీటీడీ, కర్రలు ఎందుకు ఇస్తున్నారో చెప్పిన భూమన

దొంగతనాలను అరికట్టడానికి ప్రత్యేకంగా క్రైం టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇద్దరు డీఐజీలు నిరంతరాయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని తెలిపారు. భద్రతా ఏర్పాట్ల కోసం డ్రోన్ కెమరాలు వినియోగిస్తామని చెప్పారు. అనంతరం తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో 15 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు.

చిన్నపిల్లలు తప్పి పోకుండా జియో ట్యాగింగ్ చేస్తామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో నాలుగు అంశాలపై భద్రతా సిబ్బంది దృష్టి సారించాలని డీఐజీ రవిప్రకాష్ పేర్కొన్నారు. క్రౌడ్ మేనేజ్ మెంట్, ట్రాఫిక్ మేనేజ్ మెంట్, వీఐపీల భద్రత, భక్తుల భద్రతపై దృష్టి సారించాలన్నారు.

Dharma Reddy: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ ఏర్పాట్లన్నీ చేశాం.. భక్తులు ఇలా సేవలు వినియోగించుకోవాలి

భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించడంతో పాటు వారిని గైడ్ చెయ్యాలని సూచించారు. మాడవీధులు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరాయంగా పర్యవేక్షించాలని చెప్పారు.