వ్యవస్థలో విప్లవాత్మక మార్పు కోసమే ‘దిశ చట్టం’: సీఎం జగన్

ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడాలంటే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాలనీ..అందుకే ‘దిశ చట్టాన్ని’ తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. సమాజంలో మార్పు రావాలన్నారు. ఆడవారి జోలికి వస్తే కఠిన శిక్షలు పడతాయని భయం వ్యవస్థలో రావాలనీ..వ్యవస్థలో మార్పు కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోక తప్పదనీ..తమ చెల్లెళ్లు..అక్కల భద్రత కోసం ‘దిశ చట్టాన్ని’ తీసుకొచ్చామని తెలిపారు.
ఆడబిడ్డలు బైటకు రావాలంటే భయపడే పరిస్థితి సమాజంలో నెలకొందనీ..రోజు రోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయనీ..దీంతో ఆడవారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు.
ప్రతీ చోటా దిశ ఘటనపై చర్చ జరుగుతోందనీ..ఇటువంటి ఘనటను పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీలో 13 జిల్లాల్లో ఆడవారిపై జరగుతున్న అఘాయిత్యాలు సంబంధించి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ స్పెషల్ కోర్టుల్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల కేసులపై తక్షణ విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తామన్నారు.
లైంగిక దాడుల్లో 21 రోజుల్లో విచారణ పూర్తి అయ్యి తీర్పు అతి త్వరగా వచ్చేలా..నిందితులు దోషులుగా నిరూపించడిన వెంటనే ఉరిశిక్ష పడేలా చర్యలు ఈ స్పెషల్ కోర్టులు పనిచేస్తాయని తెలిపారు. దీంట్లో భాగంగా..చట్టాల్లో మార్పులు తీసుకొస్తామనీ..173,309 సెక్షన్లలో మార్పులు తీసుకొస్తామన్నారు. అత్యాచార కేసుల్లో ఖచ్చితమైన ఆధారాలతో నిరూపణ అయితే దోషులకు మరణశిక్ష పడేలా మార్పుల్ని తీసుకొస్తామన్నారు.
అంతేకాదు సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరుస్తూ..అగౌరపరిచేలా పాల్పడినవారికి కూడా కఠిన శిక్షల్ని అమలు జరిగేలా చట్టాలను రూపొందిస్తామన్నారు.
దిశ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మంత్రి సుచరిత
అత్యాచారం ఘటనలో 21 పనిదినాల్లో నిందితుడు దోషిగా నిరూపించబడం వంటి పలు కీలక ఘట్టాల్నీ పూర్తైన తరువాత దోషిగా తేలటం..ఇలా అన్నీ 21 రోజుల్లో అఘాయిత్యాలకు పాల్పడినవారికి ఉరిశిక్ష పడేలా దిశ చట్టం రూపొందించేందుకు సీఎం జగన్ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయించటం..దాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఐదవ రోజు హోంమత్రి సుచరిత దిశ చట్టం బిల్లును ప్రవేశ పెట్టారు.
గతంలో అత్యాచార ఘటనలల్లో విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నాలుగు నెలల్లో పూర్తి కావాలనే నిబంధన ఉంది. ఆ నిబంధనను సీఎం జగన్ ప్రభుత్వం మరింతగా కుదించి…మూడు వారాల్లోగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి 21 రోజుల్లో ఉరి శిక్షపడాలని మార్పులు చేశారు. ఈ దిశ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందింది.