APSRTC లో ఆ ఉద్యోగులను తొలగించలేదు : పేర్నినాని 

  • Published By: srihari ,Published On : May 16, 2020 / 08:07 AM IST
APSRTC లో ఆ ఉద్యోగులను తొలగించలేదు : పేర్నినాని 

Updated On : May 16, 2020 / 8:07 AM IST

ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించలేదని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఎవరినీ తొలగించం…యధావిధిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పనే గానీ తొలగింపు ఉండదన్నారు. కరోనా దృష్ట్యా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల పర్మినెంట్ ఉద్యోగులను ముందుగా విధులు నిర్వర్తించేలా సర్క్యులర్ జారీ ఇచ్చామని తెలిపారు. 

కరోనా సంక్షోభం వల్ల ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోయామని పేర్కొన్నారు. దీన్ని కూడా రాజకీయం చేసి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని తెలిపారు. ఆర్టీసీలో ఎవరినీ తొలగించలేదని…యధావిధిగా కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెంద వద్దని సూచించారు. ఆర్టీసీలో ఒకే సారి 6 వేల మందికిపైగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులకు హాజరు కావొద్దంటూ డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు కూడా అందలేదు. ఒక్కసారిగా 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగించారని కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. దీంతో మంత్రి పేర్ని నాని స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Read Here>> ఏపీలో 24 గంటల్లో 48 కరోనా కేసులు