Nandamuri Balakrishna : ప్రజలారా జాగ్రత్త.. ఆ ఈవెంట్‌కు నా అనుమతి లేదు.. నమ్మి మోసపోవద్దు.. బాలయ్య హెచ్చరిక..!

Nandamuri Balakrishna : బసవతారకం ఆస్పత్రి పేరుతో చేసే అలాంటి ప్రకటనలు, మోసాలను ఎవరూ నమ్మొద్దు.. వాటికి నా అనుమతి లేదు.

Nandamuri Balakrishna : ప్రజలారా జాగ్రత్త.. ఆ ఈవెంట్‌కు నా అనుమతి లేదు.. నమ్మి మోసపోవద్దు.. బాలయ్య హెచ్చరిక..!

Nandamuri Balakrishna

Updated On : July 29, 2025 / 11:16 PM IST

Nandamuri Balakrishna : బసవతారకం ఆస్పత్రి ఈవెంట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి.. ఇలాంటి కార్యక్రమాల పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. బసవతారకం (Nandamuri Balakrishna) ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి పేరుతో ఎలాంటి ప్రకటనలను నమ్మొద్దు.. ఎవరూ మోసపోవద్దంటూ ఆస్పత్రి చైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణ ప్రజలను హెచ్చరించారు.

నా అనుమతి లేకుండా విరాళాల సేకరణ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా వేదికగా ప్రజలను హెచ్చరించారు.

‘‘ప్రజలకు హెచ్చరిక.. ‘బంగారు బాలయ్య-బసవతారకం ఈవెంట్‌’ పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారు.

Read Also : Cardless Withdrawals : ఏటీఎంలో డబ్బులు తీయాలా? డెబిట్ కార్డుతో పనిలేదు.. ఈ 6 సింపుల్ స్టెప్స్ ద్వారా క్యాష్ విత్‌డ్రా చేయొచ్చు..

ఆ ఈవెంటుకు నా అనుమతి లేదు :
విరాళాల సేకరణ కోసం ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి, అసలు ఈ ఈవెంట్‌కు నా అనుమతి లేదు. ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు నుంచి కూడా ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదని ప్రజలందరూ తప్పక గమనించాలి.

దయచేసి ఇలాంటి అనధికారిక, తప్పుదారి పట్టించే ఈవెంట్ల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బసవతారకం ఆస్పత్రి తరఫున విరాళాల అభ్యర్థనలు, అన్ని అధికారిక కార్యక్రమాలన్ని కేవలం ధృవీకరించిన పారదర్శక మాధ్యమాల ద్వారానే నిర్వహించడం జరుగుతుంది. అందుకే ప్రజలెవరూ ఈ మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని బాలకృష్ణ తెలిపారు.