ఆ ఇంటి చుట్టూ పంచాయితీ.. దువ్వాడ భార్యాభర్తల మధ్య కుదరని రాజీ
ఈ బిల్డింగ్ విషయంలో ముగ్గురూ ఏకాభిప్రాయానికి వస్తే పంచాయితీకి తెరపడే అవకాశం ఉంది.

Duvvada Family Issue : టెక్కలిలో ఓ ఇంటి చుట్టూ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పంచాయితీ నడుస్తోంది. టెక్కలిలోని భవనాన్ని తాను భార్యకు ఇవ్వబోనని శ్రీనివాస్ తేల్చి చెబుతున్నారు. బిల్డింగ్ రాసిస్తే తనను బయటకు గెంటేస్తారని అంటున్నారు. 22 సెంట్లలో కట్టిన డుప్లెక్స్ బిల్డింగ్ నిర్మిస్తుండగా తాను కూడా కొంత మొత్తం ఇచ్చానని మాధురి చెబుతున్నారు. తనకూ వాటా ఉంటుందన్నారు. ఈ బిల్డింగ్ విషయంలో ముగ్గురూ ఏకాభిప్రాయానికి వస్తే పంచాయితీకి తెరపడే అవకాశం ఉంది.
టెక్కలి పట్టణంలో వెంకటేశ్వర కాలనీలో ఉన్న భవనం రూ.7 కోట్లు విలువ చేస్తుంది. దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు. ఇక చిన్నమ్మాయి చదువు ఖర్చులు భరించేందుకు, పెళ్లి ఘనంగా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు టెక్కలి జాతీయ రహదారిపై ఉన్న భవనం చుట్టూ వివాదం రాజుకుంది. ఈ భవనం రూ.5 కోట్ల వరకు విలువ చేస్తుంది. ఈ బిల్డింగ్ కే మాధురి వస్తుంది, ఇందులో వారి కార్యక్రమాలు జరుగుతున్నాయని దువ్వాడ వాణి ఆరోపిస్తున్నారు. ఈ బిల్డింగ్ కు మాధురి రాకూడదని, ఈ బిల్డింగ్ ను తన పిల్లల పేరు మీద రాయాలని దువ్వాడ వాణి డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఈ బిల్డింగ్ లో తనకూ వాటా ఉందని మాధురి అంటున్నారు. తన తదనంతరం ఈ భవనం పిల్లలకు దక్కేలా రాస్తారని దువ్వాడ శ్రీనివాస్ తొలుత చెప్పారు. ఆ తర్వాత ఆ మాట కూడా వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ బిల్డింగ్ వాణి పేరు మీద రాస్తే, బిల్డింగ్ ను వారు స్వాధీనం చేసుకుంటారని, తాను రోడ్డున పడాల్సి వస్తుందని దువ్వాడ శ్రీనివాస్ వాపోతున్నారు. గతంలో కూడా ఇల్లు లేక తన బంధువుల దగ్గర ఉండాల్సి వచ్చిందన్నారు. తనకున్న ఆస్తి అదొక్కటే అంటున్నారు. గతంలో తనను తీవ్ర ఇబ్బందులు పెట్టారని, తనను రోడ్డున పడేశారని వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్డింగ్ ను ఇచ్చేది లేదన్నారు. రాజకీయంగా టెక్కలిలో ఉండే ఆవశ్యకత ఏర్పడిందని.. పార్టీ ఆఫీస్ కోసం, తాను నివాసం ఉండేందుకు 22 సెంట్లలో ఈ భవనాన్ని కట్టామన్నారు. కచ్చితంగా తాను ఈ భవనంలోనే ఉంటానని శ్రీనివాస్ తేల్చి చెప్పారు.
ఈ బిల్డింగ్ కు మాధురి వస్తుందని, శ్రీనివాస్ తో సన్నిహితంగా ఉంటుందని, దాని వల్ల తమ కుటుంబ పరువుకు నష్టం జరుగుతుందని, తనకు ఆడపిల్లలు ఉన్నారని, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారని, రేపు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని దువ్వాడ వాణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ బిల్డింగ్ ను తన పిల్లల పేరు మీద రాయకపోతే.. దాన్ని మాధురి దక్కించుకునే అవకాశం ఉందని దువ్వాడ వాణి భయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ భవనాన్ని తన పిల్లల పేరు మీద రాయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
వాణి డిమాండ్స్..
1. నన్ను, నా కూతుళ్లను ఇంట్లోకి అనుమతించాలి
2. ఆస్తులను పిల్లల పేర్లపైకి మార్చాలి, అప్పులు తీర్చాలి
3. మాధురిని ఇంట్లోకి, తన జీవితంలోకి రానివ్వకూడదు
4. శ్రీనివాస్ ఉంటున్న బిల్డింగ్ ను కూడా కూతుళ్ల పేరుపై రాయాలి
5. చిన్న కూతురి చదువు, పెళ్లి బాధ్యత శ్రీనివాస్‌దే
దువ్వాడ శ్రీనివాస్ స్పందన..
1. ఆస్తులు ఇవ్వడానికి సిద్ధమే
2. బిడ్డలకు ఎలాంటి లోటు రానివ్వను
3 .బిల్డింగ్ ఇవ్వడం కుదరదు
4. బిల్డింగ్ పై ఎవరికీ హక్కు లేదు
కాగా.. దువ్వాడ వివాదంలో మరోసారి కుటుంబసభ్యుల మధ్య చర్చలు జరిగాయి..
వాణి డిమాండ్స్..
* ఫ్యాక్టరీలో సమస్యలను క్లియర్ చేయాలి
* టెక్కలి వెంకటేశ్వర కాలనీలోని బంగ్లాని రాసివ్వాలి, దాని లోన్ తీర్చాలి
* పిల్లల చదువు, పెళ్లి భాద్యతలు.. దువ్వాడ శ్రీనివాస్ చూసుకోవాలి
* డైవర్స్ ప్రపోజల్స్ వెనక్కి తీసుకోవాలి
* దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు తదనాంతరం పిల్లలకు చెందే విధంగా రాయాలి
5 డిమాండ్లలో 3 డిమాండ్లను ఒప్పుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. విడాకుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని దువ్వాడ శ్రీనివాస్ తేల్చి చెప్పారు.
ఇంత వివాదం జరిగాక వాణితో కలిసి బతకలేనన్నారు. తాను ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని సైతం రాసివ్వనన్న దువ్వాడ శ్రీనివాస్. తాను బతకడం కోసం ఇల్లు అవసరం అని ఆయన స్పష్టం చేశారు.
Also Read : దువ్వాడ కుటుంబంలో చిచ్చుకు అసలు కారణం అదేనా, ఆమె వ్యూహం ఫలించిందా?