ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. కరెంట్ బిల్లులు కట్టడం ఇప్పుడు ఇంకా సింపుల్.. జస్ట్..

కూర్చున్న చోటు నుంచే ఫోన్‌లో బిల్లు చెల్లించే విధానాన్ని ఏపీఈపీడీసీఎల్ ప్రవేశపెట్టింది.

ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. కరెంట్ బిల్లులు కట్టడం ఇప్పుడు ఇంకా సింపుల్.. జస్ట్..

Power Bill Payment

Updated On : July 19, 2025 / 3:45 PM IST

Power Bill Payment: ఏపీలో విద్యుత్ బిల్లుల చెల్లింపు ఇకనుంచి మరింత సులభతరం కానుంది. ఏపీఈపీడీసీఎల్ యాప్ ద్వారా ఇతర ఆన్‌లైన్ చెల్లింపులు ఎప్పుటి నుంచో అందుబాటలో ఉన్నప్పటికీ.. మన మీటర్ సర్వీస్ నెంబర్ అంకెలు నమోదు చేసి చెల్లిస్తుంటాం. ఈ సమయంలో పొరపాటున సర్వీస్ నెంబర్ అంకెలు తప్పుకొడితే వేరొకరికి బిల్లు చెల్లింపు జరిగిపోతుంది.

ఆన్‌లైన్ చెల్లింపులపై అవగాహన లేనివారు విద్యుత్ కార్యాలయాలకు, మీ సేవా కేంద్రాలకు వెళ్లి విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న పరిస్థితి. అయితే, ఇక నుంచి ఎవరైనా సులువుగా.. నెంబర్ ఎంటర్ చేయకుండా.. కేవలం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి విద్యుత్ బిల్లులు చెల్లింపులు చేసే విధానాన్ని ఏపీఈపీడీసీఎల్ ప్రవేశపెట్టింది.

కూర్చున్న చోటు నుంచే ఫోన్‌లో బిల్లు చెల్లించే విధానాన్ని ఏపీఈపీడీసీఎల్ ప్రవేశపెట్టింది. విద్యుత్ సిబ్బంది మీకు ఇచ్చిన బిల్లుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇది ఏ యూపీఐ యాప్ ద్వారా అయినా స్కాన్ చేయొచ్చు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఇలా ఏ పేమెంట్‌గేట్‌వే యాప్ ద్వారా అయినా బిల్లుపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు విద్యుత్ బిల్లును చెల్లించొచ్చు.

మీ ఫోన్‌ ద్వారా షాపుల్లో చెల్లింపులు చేసిన విధంగానే.. మీ కరెంట్ బిల్లుపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి. అలా స్కాన్ చేసిన తరువాత మీ పేరు, మీ సర్వీస్ నెంబర్ తో పాటు ఎంత చెల్లించాలో కూడా చూపిస్తుంది. బటన్ ప్రెస్ చేసి మీ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా కూడా మీరు మీ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.