చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగులు బీభత్సం..పంటలను నాశనం చేసిన 13 గజరాజుల మంద

చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగులు బీభత్సం..పంటలను నాశనం చేసిన 13 గజరాజుల మంద

Updated On : December 16, 2020 / 12:53 PM IST

Elephants destroy crops in Chittoor : అటవీశాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం ఆగడం లేదు. శాంతిపురం మండలం ఏంకే పురంలో గజరాజుల మంద మరోసారి పంటలపై దాడి చేసింది. పదమూడు ఏనుగులు గ్రామంలోని పొల్లాల్లో పడి పంటలను ధ్వంసం చేశాయి.

వరి, బీన్స్‌, అరటి, టమాట పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరు అయ్యారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి ఆరుగాలం శమ్రించి పండించిన పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామలపై దాడి చేయకుండా అడవుల వైపు మళ్లిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. డిసెంబర్‌ 9న కూడా పొలాలను నాశనం చేశాయి.