Ambati Rayudu : సీఎం జగన్‌తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక భేటీ

రాజకీయాల్లోకి వస్తున్నట్లు అంబటి రాయుడు ఇప్పటికే ప్రకటన చేశారు. దాంతో పాటు అధికార వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారు. ప్రభుత్వ అవేర్ నెస్ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

Ambati Rayudu : సీఎం జగన్‌తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక భేటీ

Ambati Rayudu

Updated On : December 28, 2023 / 7:14 PM IST

తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంబటి రాయుడు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొన్ని రోజులుగా వైసీపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు జగన్ తో భేటీ అయిన రాయుడు.. తాజాగా మరోసారి భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజకీయాల్లోకి వస్తున్నట్లు అంబటి రాయుడు ఇప్పటికే ప్రకటన చేశారు. దాంతో పాటు అధికార వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారు. ప్రభుత్వ అవేర్ నెస్ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. గుంటూరుకు చెందిన రాయుడు వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. గుంటూరు ఎంపీగానే పోటీ చేస్తారా? మరో చోటుకి మారుస్తారా? అనేదానికి సంబంధించి క్లారిటీ రానుంది.

Also Read : పవన్ కల్యాణ్ వేట.. గెలుపు గుర్రాల ఎంపిక కోసం స్వయంగా రంగంలోకి, ముందుగా అక్కడి నుంచే

వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న జగన్.. పార్టీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు జగన్. మరికొందరికి స్థానచలనం కల్పించారు. కొత్త వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. మార్పులు చేర్పులకు సంబంధించి సీఎం జగన్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఎవరిని ఎక్కడికి మార్చాలి? కొత్త వారిని ఎవరిని తీసుకురావాలి? ఎంపీగా ఎవరు వెళ్లబోతున్నారు? ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేయనున్నారు? వీటన్నింటికి సంబంధించి చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు జగన్.

ఇందులో భాగంగానే రాయుడిని తాడేపల్లికి పిలిపించారు జగన్. అంబటి రాయుడు ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే గుంటూరు నుంచి పోటీ చేస్తారా? లేక మరో నియోజకవర్గానికి మారుస్తారా? అనేది తెలిసే అవకాశం ఉంది.

Also Read : నారా లోకేశ్‌తో వట్టి పవన్ భేటీ.. ఉంగుటూరు సీటు కోసమేనా?

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఎంపీగా పోటీ చేయాలని అంబటి రాయుడు భావిస్తున్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలన, కార్యక్రమాలకు ఆకర్షితుడినై వైసీపీ వైపు అడుగులు వేశానంటూ రాయుడు చెప్పుకొచ్చారు. రాయుడు పొలిటికల్ కెరీర్ ఏ విధంగా ఉండబోతోంది అనేది సీఎం జగన్ తో భేటీ తర్వాత స్పష్టత రానుంది.