Vallabhaneni Vamsi Arrest : వంశీని ఎలిమినేట్ చేయాలని చూశారు- అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వంశీ బెయిల్ పై ఉన్నారు. టీడీపీ వాళ్లు పోలీసులతో కుమ్మక్కై ఇదంతా చేశారు.

Vallabhaneni Vamsi Arrest : వంశీని ఎలిమినేట్ చేయాలని చూశారు- అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

Updated On : February 13, 2025 / 8:46 PM IST

Vallabhaneni Vamsi Arrest : వల్లభనేని వంశీ అరెస్ట్ పై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వంశీ అరెస్ట్ అక్రమం అని ఆయన అన్నారు. అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో తనకు అర్థం కావడం లేదన్నారు. వంశీ మీద సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కక్ష కట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. వంశీని అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా.. అరెస్ట్ చేయడం దారుణం అన్నారు అంబటి రాంబాబు.

”వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వంశీ బెయిల్ పై ఉన్నారు. టీడీపీ వాళ్లు పోలీసులతో కుమ్మక్కై ఇదంతా చేశారు. డీజీపీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఎవరు వినతిపత్రం కూడా స్వీకరించలేదు” అని అంబటి రాంబాబు అన్నారు.

Also Read : నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో తెలీదు, ఇంకా ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు- వంశీ భార్య పంకజశ్రీ

వంశీ అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ నేతలు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. వినతిపత్రం సమర్పించేందుకు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్ వెళ్లారు. అయితే, డీజీపీ ఆఫీస్ లో ఎవరూ తమ వినతిపత్రాన్ని స్వీకరించలేదని వైసీపీ నేతలు చెప్పారు.

‘హైదరాబాద్ లో వంశీ ని అరెస్ట్ చేశారని మీడియా ద్వారా మాకు తెలిసింది. అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే.. ఆయన రెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీ ముద్దాయిగా ఉన్నారు. దాని మీద ఆయన కోర్టుకు వెళ్లడం, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడం, ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది.

Also Read : వల్లభనేని వంశీ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కాబట్టి వంశీని అరెస్ట్ చేసే అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది. కానీ , ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే.. ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం. దిగ్భ్రాంతి చెందాం. తెలుగుదేశంలో గెలిచాడు. తర్వాత వైసీపీలోకి వచ్చి పోటీ చేశాడు. అందువల్ల వంశీ మీద చంద్రబాబు, లోకేశ్ కక్ష కట్టారు’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

”ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదు. మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్లి పోటీ చేశాడు. మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు. మా పార్టీలో ఉండి, మా సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, మమ్మల్ని దూషించడం ఏంటి, రాజకీయ విమర్శలు చేయడం ఏంటి? అని కక్ష కట్టి, వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేకసార్లు దాడులు చేసేందుకు ప్రయత్నించారు. కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసిన విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని చూసినా న్యాయస్థానానికి వెళ్లి వంశీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడంతో ఇవాళ సడెన్ గా నిన్న సాయంత్రమో మొన్న ఉదయమో కేసు రిజిస్ట్రర్ చేసి ఆ కేసుని ఇంకా ఆన్ లైన్ లో అప్ లోడ్ కూడా చేయకుండా వంశీని అరెస్ట్ చేసి తీసుకొచ్చి రాత్రిలోపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది.

ఇది అన్యాయం. పోలీసులు, టీడీపీ పార్టీ వారితో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని డీజీపీకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. పొద్దున నుంచి వంశీతో ఎవరినీ కలవనివ్వలేదు. వంశీ భార్య వెళ్తుంటే ఆమెను అడ్డుకున్నారు. ఆమెను వెళ్లనివ్వలేదు.

న్యాయ సాయం చేద్దామని అడ్వకేట్స్ వెళ్లి కలిసే ప్రయత్నం చేశారు. ఎఫ్ఐఆర్ ఏంటో తెలుసుకుని కోర్టులో ఆర్గ్యు చేద్దామని అనుకున్నారు. కానీ, పోలీసులు న్యాయవాదులను కలనివ్వలేదు. నేరారోపణ చేయబడ్డ వ్యక్తే తప్ప నేరస్తుడు కాదు. చంద్రబాబు, జగన్ తో సహా. అలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి కూడా పోలీసులు అలో చేయడం లేదంటే ఇది దుర్మార్గం, రాక్షస పాలన” అని నిప్పులు చెరిగారు అంబటి రాంబాబు.