Perni Nani : ఆ కేసులో ట్విస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన మాజీమంత్రి పేర్ని నాని..

ఈ కేసు విచారణపై ఎవరికీ అపోహలు అవసరం లేదని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ వెల్లడించారు.

Perni Nani : ఆ కేసులో ట్విస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన మాజీమంత్రి పేర్ని నాని..

Updated On : December 23, 2024 / 10:48 PM IST

Perni Nani : వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రేషన్ బియ్యం కేసులో విచారణకు రావాలని పేర్ని నాని, అతడి కుమారుడు కిట్టుకి పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆ నోటీసులు క్వాష్ చేయాలని హైకోర్టులో పేర్ని నాని, కిట్టు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది.

అటు రేషన్ బియ్యం కేసులో ఏ1 గా ఉన్న పేర్ని నాని భార్య జయసుధ.. ముందస్తు బెయిల్ పై రేపు జిల్లా కోర్టు విచారణ జరగనుంది. ఇదే కేసులో ఏ2గా ఉన్న గోడౌన్ మేనేజర్ మానస తేజ క్వాష్ పిటిషన్ పై కూడా రేపు విచారణ చేయనుంది కోర్టు.

Perni Nani Godown

ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదు- ఎస్పీ
పేర్ని నాని ఫ్యామిలీ రేషన్ బియ్యం కేసుపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ స్పందించారు. మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాము ఒకసారి నోటీసులు ఇచ్చామని, బహుశా ఆ నోటీసులు ఆయనకు చేరలేదేమో, అందుకే మళ్లీ నోటీసులు ఇస్తామంటూ ఎస్పీ స్పష్టం చేశారు. రేషన్ బియ్యం మిస్సింగ్ పై ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు.

Also Read : లుంగీ కట్టుకుని ఇంట్లో కూర్చోవడం బెటర్- కడప మేయర్‌పై ఎమ్మెల్యే మాధవి ఫైర్

దీనిపై లోతైన విచారణ జరుగుతోందన్నారు. రికార్డులతో పాటు సీపీయూ సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ కి పంపించామని, విచారణ త్వరగా పూర్తి చేసి త్వరలోనే కేసును ఓ కొలిక్కి తెస్తామన్నారు. ఈ కేసు విచారణపై ఎవరికీ అపోహలు అవసరం లేదని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ వెల్లడించారు.

త్వరలోనే కేసును కొలిక్కి తెస్తాం..
‘మన జిల్లాలో సివిల్ సప్లయ్స్ బఫర్ గోడౌన్ లో జరిగినటువంటి అవకతవకలు, అలాగే షార్టేజ్ విషయంలో బందర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు రిజిస్ట్రర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దానికి సంబంధించి బిల్లు షార్టేజ్ ఎలా వచ్చింది, అవి ఎక్కడికి వెళ్లాయి అనే దాని మీద విచారణ చేస్తాం. దానికి సంబంధించిన రికార్డులు, ఉపయోగించిన సిపియు కూడా మేము సీజ్ చేశాం. వాటిని ఎఫ్ఎస్ఎల్ కి పంపించాము. త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి స్తాయిలో కంప్లీట్ చేసి ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావడం జరుగుతుంది’ అని ఎస్పీ గంగాధర్ తెలిపారు.

PDS Rice

అజ్ఞాతంలో పేర్నినాని కుటుంబం..!
కాగా, పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాముల్లో పీడీఎస్ బియ్యం మాయంపై ఆయన విచారణకు గైర్హాజయ్యారు. అటు ఆయన భార్య జయసుధకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో కోరారు. అయితే, ఆ విచారణకు పేర్ని నాని ఫ్యామిలీ హాజరుకాలేదు. దీంతో పోలీసుల నెక్ట్స్ చర్య ఏంటన్నది ఉత్కంఠగా మారింది.

Also Read : విశాఖలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు.. ఫ్యాన్‌ పార్టీకి హ్యాండ్‌ ఇస్తున్న కీలక నేతలు..