Chevireddy Bhaskar Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఛాతిలో నొప్పి.. వెంటనే ఆసుపత్రికి తరలించిన పోలీసులు..
ఛాతి నొప్పి కారణంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

Chevireddy Bhaskar Reddy: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి తనకు ఛాతిలో నొప్పిగా ఉందని పోలీసులకు తెలిపారు. దీంతో చెవిరెడ్డిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చెవిరెడ్డికి పరీక్షలు చేస్తున్నారు వైద్యులు. ఛాతి నొప్పి కారణంగా సాయంత్రం వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా చెవిరెడ్డి ఉన్నారు. ఇవాళ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని చెవిరెడ్డి జైలు అధికారులతో చెప్పారు. వెంటనే అలర్ట్ అయిన జైలు అధికారులు చెవిరెడ్డిని విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చెవిరెడ్డికి డాక్టర్లు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
Also Read: జగన్ “రప్పా.. రప్పా” డైలాగ్‌పై రచ్చ కంటిన్యూ.. ఏం జరుగుతోంది?
జైల్లో తనకు ఇంటి నుంచి భోజన సదుపాయం కల్పించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు చెవిరెడ్డి. జైల్లో పెడుతున్న ఆహారం తనకు పడటం లేదని చెవిరెడ్డి వాపోయారు.