విశాఖలో అగ్ని ప్రమాదం

విశాఖలో అగ్ని ప్రమాదం

Updated On : January 28, 2021 / 10:04 AM IST

Fire accident in Visakhapatnam : విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగనంపూడి ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. పామాయిల్‌ వంట నూనెల కంపెనీలో సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.

దీంతో రెండు అగ్నిమాపక యంత్రాలతో ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే.. దువ్వాడ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో కార్మికులు ఎవరూ లేరని తెలుస్తోంది.

నూనెల కంపెనీ కావడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ప్రాణ నష్టం జరగకపోయినా.. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.