Indrakeeladri Temple : విజయవాడ ఇంద్రకీలాద్రిపై తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఘాట్ రోడ్ దిగుతూ ఉండగా, ఫైరింజిన్ బ్రేక్ ఫెయిలై ప్రమాదానికి గురైంది.

Indrakeeladri Temple : విజయవాడ ఇంద్రకీలాద్రిపై తృటిలో తప్పిన పెను ప్రమాదం

Indrakeeladri Temple Incident

Updated On : March 10, 2024 / 5:51 PM IST

Indrakeeladri Temple : విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం తృటిలో తప్పింది. చెత్త కుప్పలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు వచ్చిన ఓ ఫైరింజన్ ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్ దిగుతూ ఉండగా, ఫైరింజిన్ బ్రేక్ ఫెయిలై ప్రమాదానికి గురైంది. భక్తుల పైకి దూసుకెళుతుండగా.. అప్రమత్తమైన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి డివైడర్ ను ఢీకొట్టారు. డివైడర్ ను ఢీకొట్టిన వాహనం ఆగిపోవడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఇంద్రకీలాద్రి కొండ పైభాగాన ఉన్న చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందున్న ఫైరింజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఆ తర్వాత ఘాట్ రోడ్ దిగుతుండగా.. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అదే సమయంలో భక్తులతో కూడిన టెంపుల్ బస్సు ఎదురుగా వచ్చింది. ఇది గమనించిన ఫైరింజన్ డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. ఒక్కసారిగా కుడివైపున ఉన్న డివైడర్ ను ఢీకొట్టాడు. దాంతో వాహనం ఆగిపోయింది. అటు భక్తులకు పెను ప్రమాదం తప్పింది.

ఆదివారం కావడంతో భక్తులు వేలాదిగా వచ్చారు. ఘాట్ రోడ్ మీదుగా కొందరు కాలినడకన వస్తున్నారు. కొంతమంది వాహనాల్లో కొండపైకి వస్తున్నారు. ఘాట్ రోడ్ దిగుతున్న క్రమంలో ఫైరింజన్ బ్రేకులు ఫెయిల్ కావడం కలకలం రేపింది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అటు భక్తులు, ఇటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే.. ఊహకందని ఘోరం జరిగేది అని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రేక్ ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటి? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

 

Also Read : ఆమెను భర్తే చంపేసి చెత్త డబ్బాలో వేసి.. ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువతి హత్య కేసులో సంచలన విషయాలు