Fish Attack : చేప దాడిలో మత్స్యకారుడు మృతి

చేప కొమ్ముకు ఉన్న విషం శరీరంలోకి ప్రవేశించడంతో మత్స్యకారుడు జోగన్న మృతి చెందాడు. మత్స్యకారుడి మృతిపై పరవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Fish Attack : చేప దాడిలో మత్స్యకారుడు మృతి

Fish

Updated On : February 2, 2022 / 7:07 PM IST

fish attacked Fisherman : విశాఖ జిల్లాలో విషాద ఘటన జరిగింది. చేప దాడిలో మత్స్యకారుడు మృతి చెందాడు. పరవాడ మండలం ముత్యాలపాలెంలో మత్స్యకారుడు జోగన్న చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతున్న సమయంలో ఒక్కసారిగా జోగన్నపై కొమ్ముకోణం రకానికి చెందిన చేప దాడి చేసింది.

చేప కొమ్ముకు ఉన్న విషం శరీరంలోకి ప్రవేశించడంతో మత్స్యకారుడు జోగన్న మృతి చెందాడు. మత్స్యకారుడి మృతిపై పరవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మత్స్యకారుడి జోగన్న మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.