విశాఖ మన్యంలో విషాహారం తిని 70 మందికి అస్వస్ధత

విశాఖ మన్యంలో విషాహారం తిని 70 మందికి అస్వస్ధత

Updated On : June 21, 2021 / 1:32 PM IST

విశాఖ మన్యంలో ఘోరం జరిగింది . కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. జి. మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మగత పాలెంలో ఘటన జరిగింది.

చనిపోయిన ఆవు మాంసం తినటంతో వీరంతా అస్వస్ధతకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. బాధితులను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో 5 గురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.విషయం తెలిసిన పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Read Here>>విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసు నిందితులకు 14 రోజులు రిమాండ్