Anil kumar: దత్తపుత్రుడు అనే మాటల్ని పవన్ నిజం చేశారు : అనిల్ కుమార్ యాదవ్

రాజధాని ఇన్నర్, అవుటర్లలో మరికొందరు జైలుకు పోక తప్పదుని అనిల్ కుమార్ అన్నారు. ఇంకో ఆరు జన్మ లెత్తినా జనసేన, టిడిపి...జగన్ ను ఓడించలేరు అంటూ ధీమా వ్యక్తం చేశారు.

Anil kumar: దత్తపుత్రుడు అనే మాటల్ని పవన్ నిజం చేశారు : అనిల్ కుమార్ యాదవ్

Anil kumar yadav

Updated On : September 15, 2023 / 11:46 AM IST

Anil kumar yadav : రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును కలిసిన తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన (Janasena) కలిసే పోటీ చేస్తాయని ప్రకటించారు. దీంతో వైసీపీ నేతలంతా మూకుమ్మడిగా విమర్శలు సంధిస్తున్నారు. ఈ విషయం తమకు ఎప్పుడో తెలుసని ప్యాకేజీ బంధం బయటపడింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీంట్లో భాగంగానే జనసేన, టీడీపీ పొత్తు ఉందని ఎప్పుడో చెప్పాం.. దత్తపుత్రుడు ఆ మాటలు నిన్న నిజం చేశాడు అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. పవన్ కల్యాణ్ పై విమర్శలు సంధించారు.

TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?

శుక్రవారం ఉదయం అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ ప్రకటనను జనసేన కార్యకర్యలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. స్కిల్ స్కామ్ లో పక్క ఆధారాలు, సంతకాలతోనే సిబిఐ చంద్రబాబుపై కేసు నమోదు చేసిందని.. ఇక రాజధాని ఇన్నర్, అవుటర్లలో మరికొందరు జైలుకు పోక తప్పదుని అన్నారు. ఏపీలో ఏమి చేయలేక ఢిల్లీకి వెళ్లిన లోకేష్.. అక్కడ ఏమి పీకుతాడు అంటూ తనదైన శైలిలోనే వ్యాఖ్యలు చేశారు అనిల్ కుమార్.

ఇంకో ఆరు జన్మ లెత్తినా జనసేన, టీడీపీ.. జగన్ ను ఓడించలేరు అంటూ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన బంగాళాఖాతంలో కలవడం ఖాయం అన్నారు. ఏ కారణము, ఆధారం లేకుండా 16 నెలలు జగన్ జైల్లో పెట్టినప్పుడు లేవని నోళ్లు.. ఇప్పుడెందుకు లేస్తునాయని అనిల్ ప్రశ్నించారు.

Also Read: చంద్రబాబు జైలుకెళితే మీరెందుకు చనిపోలేదు?- టీడీపీ నేతలను ప్రశ్నించిన వైసీపీ ఎంపీ