మౌనం వీడిన ధర్మాన..! తగ్గేదేలే అంటూ స్కెచ్‌లు..!

వైఎస్సార్‌, జగన్‌లే కోద్దో గోప్పో జిల్లాకు న్యాయం చేశారని..అయినా వెనుకబడే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు.

మౌనం వీడిన ధర్మాన..! తగ్గేదేలే అంటూ స్కెచ్‌లు..!

Updated On : July 18, 2025 / 8:42 PM IST

సిక్కోలు సిన్సియర్, సీనియర్ పొలిటిషియన్‌..మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు..ఏడాది తర్వాత మౌనం వీడి మదిలో మాటను చెప్పేశారు. పార్టీ ఆదేశానుసారం తాను లోక్‌సభకో, రాజ్యసభకో వెళ్తానంటున్నారు. ఆవేవి కుదరకపోతే సాధారణ కార్యకర్తగా జెండా మోసుకుని తిరుగుతానని..అంతే గాని అతీగతీ లేని పార్టీల్లోకి వెళ్లనంటూ గట్టిగానే చెప్పుకొచ్చారు. తాను పనిచేయలేకపోతే మరో వ్యక్తిని ఇంచార్జ్‌గా నియమిస్తామన్నారు.

సంవత్సర కాలంగా శ్రీకాకుళం వైసీపీ చేపట్టిన కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉంటూ వచ్చారు ధర్మాన. కానీ బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ..రీకాల్ చంద్రబాబు మ్యానిఫెస్టో.. పేరుతో వైసీపీ చేపట్టిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో తలుక్కుమన్నారు. రాను రానంటూనే కార్యక్రమానికి వచ్చిన ధర్మాన..కార్యకర్తలకు ఫుల్ బూష్టింగ్ ఇచ్చి మరీ జోష్ నింపారు. తన గురించి ఎవరూ ఆలోచించొద్దన్న ఆయన..త్వరలో యాక్టీవ్ అవుతానని..ఆరోగ్యం వంటి వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు. క్యాడర్ మాత్రం కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల తర్వాత ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తగ్గేదేలే..
అధినేత జగన్‌ ఎంత చెప్పినా..సీనియర్ నేతలైన రీజనల్ ఇంచార్జ్‌లు బొత్స సత్యనారాయణ, కన్నబాబు కూడా అనేక సార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తగ్గేదేలే అన్నారు ధర్మాన. రెండేళ్ల వరకు తాను రాజకీయాలు మాట్లాబోనన్న ఆయన..ఎట్టకేలకు ఏడాది తర్వాత మౌనం వీడి..తన పొలిటికల్ ప్లానింగ్ ఏంటో చెప్తూనే కూటమిపై విమర్శల దాడి చేశారు. అయితే తన ప్రసంగంలో రాజకీయ కొత్త పంథాను బయటపెట్టారు ధర్మాన. జిల్లా అభివృద్ది మంత్రం జపిస్తున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో శ్రీకాకుళం జిల్లాను అభివృద్ది చేసిన పార్టీనే లేదని .. 50 ఏళ్లు గడిచినా వంశధార ప్రాజెక్టును నిర్మించుకోలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: సివిల్ సర్వీసెస్ పరీక్షలో 2వ ర్యాంకర్.. ఈ IAS లైఫ్ ఎలా ఉందంటే? టీనా డాబీతో విడాకుల తర్వాత, డాక్టర్ మెహరీన్‌తో కొత్త జీవితం..

వైఎస్సార్‌, జగన్‌లే కోద్దో గోప్పో జిల్లాకు న్యాయం చేశారని..అయినా వెనుకబడే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. జిల్లా అభివృద్ది కోసం తన పోరాటం సాగుతుందంటూ ధర్మాన ప్రకటించడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థులపై..విమర్శలు మాని..జిల్లాలో సమస్యలపై పోరాటం మొదలు పెట్టాలంటూ ధర్మాన పిలుపునివ్వడం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి..టీడీపీని దెబ్బకొట్టి.. ప్రజల్ని తమవైపు తిప్పుకోవాలనేది ధర్మాన వ్యూహమట. సిక్కోలు సీనియర్ లీడర్ వేస్తున్న కొత్త ప్లాన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.