విశాఖలో నలుగురు కరోనా అనుమానితులు…విమాన సర్వీసులు రద్దు

విశాఖ వాసులను కరోనా వణికిస్తోంది. నగరంలోని చెస్టు ఆస్పత్రిలో నలుగురు కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 04:30 AM IST
విశాఖలో నలుగురు కరోనా అనుమానితులు…విమాన సర్వీసులు రద్దు

Updated On : March 14, 2020 / 4:30 AM IST

విశాఖ వాసులను కరోనా వణికిస్తోంది. నగరంలోని చెస్టు ఆస్పత్రిలో నలుగురు కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను తాకింది. విశాఖ వాసులను కరోనా వణికిస్తోంది. నగరంలోని చెస్టు ఆస్పత్రిలో నలుగురు కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మరో ముగ్గురి రిపోర్టుల కోసం వేయిట్ చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 16 అనుమానిత కేసులు నమోదు కాగా 13 నెగెటివ్ గా తేలింది. మరోవైపు కరోనా భయంతో విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. విశాఖ, కౌలాలంపూర్ మధ్య ఎయిర్ ఏషియా విమానాలు రద్దు చేశారు. విశాఖ-సింగపూర్ మద్య కూడా విమాన సర్వీసు రద్దు అయింది.

విశాఖ రైల్వే స్టేషన్ లో కరోనా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. మాస్కులు ధరించాలని ఆటో డ్రైవర్లకు ఆదేశాలిచ్చారు. ఇక దేవాలయాల్లో కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సింహాచలం దేవాలయంలో భక్తులకు మాస్కులు పంపిణీ చేస్తున్నారు. (అతడు కరోనాని జయించాడు)

నెల్లూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో జనం భయపడిపోతున్నారు. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు వాసికి కరోనా పాజిటివ్‌ అని పూణే లోని వైరాలజీ ల్యాబ్‌ నిర్ధారించింది. మొదట తిరుపతి స్విమ్స్‌లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్‌ అని గుర్తించారు. తుది నివేదిక కోసం ఆ శాంపిల్స్‌ను పుణెలోని ల్యాబ్‌కు పంపగా.. గురువారం అందిన నివేదికలోనూ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ప్రకటించారు.(139 దేశాలకు పాకిన కరోనా..ప్రపంచవ్యాప్తంగా 5,417 మంది మృతి )

దీంతో నెల్లూరు జిల్లా అంతా హెల్త్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ఈ క్రమంలోనే పాఠశాలలకు 18వరకు సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు. ఇప్పటికే నగరంలో సినిమా హాల్స్ ను మూసివేసిన అధికారులు..  మాల్స్ లో పర్యవేక్షణ, ఎక్కువగా జనవాసాలు గుమికూడవద్దని సూచించారు.

ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో అలెర్ట్ అయిన జిల్లా యంత్రాంగం.. 150 మంది అనుమానితులను పరిశీలనలో ఉంచింది వైద్య శాఖ. ఐసోలేషన్ వార్డులో 9 మందికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. నగరంలో స్విమ్మింగ్ ఫూల్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణపట్నం పోర్ట్, శ్రీహరికోట రాకెట్ కేంద్రాలను అప్రమత్తం చేశారు.