Accident : తిరుపతిలో లారీని ఢీకొన్న టాటా ఏస్..నలుగురు మృతి
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టాటా ఏస్ వాహనం లారీ ఢీకొంది.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు.

4 Dead And 9 Injured In An Accident In Srikalahasti
Accident In AP : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టాటా ఏస్ వాహనం లారీ ఢీకొంది.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాళహస్తి సమీపంలోని పూతలపట్టు- నాయుడు పేట హైవేపై ఈ ప్రమాదం సంభవించింది.
తిరుపతిలోని చంద్రగిరికి చెందిన 12 మంది నాయుడుపేట సమీపంలోని కనువూరమ్మ ఆలయాన్ని దర్శించుకుని టాటా ఏస్ వాహనంలో తిరిగి తిరుపతి బయలుదేరారు. ఈ క్రమంలో రేణిగుంట-నాయుడుపేట ప్రధాన రహదారిపై శ్రీకాళహస్తి అర్ధనారీశ్వరస్వామి ఆలయం సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో అర్జునయ్య, నరసమ్మ దంపతులతోపాటు కావ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే, గోపి, ఢిల్లీ రాణి, కవిత, ఆనంద్, శ్రీనివాసులుతోపాటు నలుగురు చిన్నారులు భవీఫ్, ధరణి, మోక్షిత, ధనుష్ గాయపడ్డారు. వీరిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరింత మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.