Road Accident : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో, నలుగురు మృతి

ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.

Road Accident : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో, నలుగురు మృతి

Bapatla Road Accident

Updated On : September 3, 2023 / 8:15 AM IST

Bapatla Road Accident : ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంతమాగులూరులో లారీని ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంతమాగులూరు గుంటూరు – కర్నూలు రహదారి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

Road Accident : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. జీపు లోయలో పడి 8 మంది కూలీలు దుర్మరణం

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు నరసరావుపేట ఆర్కెస్ట్రా గ్రూప్ కి చెందిన వారిగా సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.