Andhra Pradesh : ఏలూరు జిల్లాలో పిడుగుపడి నలుగురు కూలీలు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కూలిపని చేసుకునే కూలీలపై పిడుగు పడింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు మరో ముగ్గురు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి.

Four laborers died with thunderbolt in eluru district
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కూలిపని చేసుకునే కూలీలపై పిడుగు పడింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు మరో ముగ్గురు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడినవారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పొట్ట కూటి కోసం కూలిపనులకు వెళితే ప్రకృతే పగబట్టినట్లుగా ఆ శ్రమ జీవులపై పిడుగు పడింది. దీంతో నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఏలూరు జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడి నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని విజయవాడలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జామాయిల్ కర్రలు తొలగిస్తుండగా కూలీలపై పిడుగు పడినట్లు సమాచారం. నలుగురి మృతదేహాలను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.