Guntur Dist : కరోనా టైం..ఆధార్ కేంద్రాలకు పరుగులు, ఎందుకో తెలుసా

ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు ఆధార్‌ నంబర్‌ను లింకు పెట్టారని ప్రచారం జరగడంతో ఆధార్‌ కేంద్రాలకు జనం క్యూ కడుతున్నారు.

Guntur Dist : కరోనా టైం..ఆధార్ కేంద్రాలకు పరుగులు, ఎందుకో తెలుసా

Aadhar

Updated On : May 24, 2021 / 1:50 PM IST

Full Rush Aadhaar Center : ఏపీలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ఇంకా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం పగటి పూట కర్ఫ్యూ విధించింది. అయితే…ఆధార్ కేంద్రాలకు జనాలు క్యూ కడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు ఆధార్‌ నంబర్‌ను లింకు పెట్టారని ప్రచారం జరగడంతో ఆధార్‌ కేంద్రాలకు జనం క్యూ కడుతున్నారు.

ఆధార్‌ అనుసంధానం కోసం వస్తున్న ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలేదు. భౌతికదూరం మచ్చుకు కూడా కనిపంచడంలేదు. రాత్రి నుంచే వచ్చి ఆధార్‌ కేంద్రాల వద్ద నిలబడుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం ఆధార్‌ కేంద్రానికి సమీప గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. రోజుల తరబడి తిరుగుతున్నా ఆధార్‌ అనుసంధానం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు 30 మందికే అనుసంధానం అవకాశం ఉన్నా.. వందల మంది తరలిరావడంతో కరోనా నిబంధనలు బేఖాతర్‌ చేస్తున్నారు. తెనాలిలో 11 ఆధార్‌ కేంద్రాలు ఉన్నప్పటికీ… ఒకే కేంద్రం పని చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read More : Black Fungus : బ్లాక్ ఫంగస్ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణమిదే..