Gas Leakage : హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లో గ్యాస్ లీక్
విశాఖలోని హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. క్రూడ్ డిస్టిలరీ యూనిట్-2లో ఎల్పీజీ గ్యాస్ లీక్ అయింది. కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

Hpcl
Hindustan Petroleum Corporation : విశాఖలోని హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. క్రూడ్ డిస్టిలరీ యూనిట్-2లో ఎల్పీజీ గ్యాస్ స్వల్పంగా లీక్ అయింది. వందలాది మంది కార్మికులు ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు. కార్మికులు సైరన్ మోగించారు. అధికారులు అప్రమత్తమై గ్యాస్ లీక్ ను నిలిపివేశారు.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది గ్యాస్ లీకేజీని అదుపులోకి తీసుకువచ్చింది. అరగంట పాటు HPCL వద్ద టెన్షన్ వాతవరణం నెలకొంది. HPCLలో గ్యాస్ లీకేజ్ పై పారిశ్రామిక ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల క్రితం ఇదే HPCLలో crude డిస్టిలరీ యూనిట్ 3 లో గ్యాస్ లీక్ అయింది.