Ghanta Padma Sri: పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ గా బీసీ మహిళ.. అభ్యర్థిని ఖరారు చేసిన వైసీపీ

ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న కవురు శ్రీనివాస్‌ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో బీసీ మహిళకు వైసీపీ అవకాశం ఇచ్చింది.

Ghanta Padma Sri: పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ గా బీసీ మహిళ.. అభ్యర్థిని ఖరారు చేసిన వైసీపీ

Updated On : June 7, 2023 / 2:00 PM IST

Ghanta Padma Sri – ZP Chairman: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా (west godavari district) జడ్పీ చైర్మన్ పదవికి అభ్యర్థిని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. బీసీ మహిళను జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. పెదపాడు జడ్పీటీసీ ఘంటా పద్మశ్రీని తమ పార్టీ తరపున అభ్యర్థిగా ప్రకటించింది. దెందులూరు (Denduluru) ఎమ్మెల్యే కొఠారు అబ్బయ చౌదరి (Kotaru Abbaya Chowdary) బుధవారం ఘంటా పద్మశ్రీకి పార్టీ తరఫున బీఫామ్ అందజేశారు. ఈ నెల 8న జడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ (zilla parishad chairman) గా ఉన్న కవురు శ్రీనివాస్‌ (Kavuru Srinivas) ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఈ స్థానం ఖాళీ అయింది.

కాగా, బీసీ మహిళకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే కొఠారు అబ్బయ చౌదరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఆయన చెప్పారు. గతంలో ఎన్నడు లేని విధంగా జిల్లాలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

అధికార వైసీపీ పార్టీకి పూర్తి మెజారిటీ ఉండడంతో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక లాంఛనం కానుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 48 మంది జడ్పీటీసీలు ఉన్నారని, ఇద్దరు తప్పా మిగతా సభ్యులంతా తమ పార్టీ వారేనని ఘంటా పద్మశ్రీ తెలిపారు. తమ పార్టీ సభ్యుల నుంచి తనకు పూర్తి మద్దతు ఉందని, గెలుపు తనదేనని ఆమె విశ్వాసం వ్యక్తంచేశారు. గెలిచిన తర్వాత జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నిరంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.

Also Read: చంద్రబాబు రాజకీయ ఉచ్చులో పవన్.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వారాహి కదులుతుంది