Gold Rate Today: బంగారం కొనుగోలుదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధరలో పెరుగుదల చోటు చేసుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ. 390 పెరిగింది. దీంతో ఢిల్లీలో ..

Gold Price
Gold and Silver Rate Today: పండుగలు, శుభకార్యాలు ఇలా ఎలాంటి సందర్భమైన మహిళలు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. వరుసగా పండుగలు రానున్న నేపథ్యంలో బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. అయితే, బంగారం ధరలు ప్రతీరోజూ తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. తాజాగా శుక్రవారం గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం ధరల్లో పెరుగుదల చోటుచేసుకున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి.

Gold
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 6గంటల వరకు నమోదైన ధరల వివరాల ప్రకారం.. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450 వద్ద కొనసాగుతుంది.

Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..
– దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధరలో పెరుగుదల చోటు చేసుకుంది. 24 క్యారెట్ల పది గ్రాములపై రూ. 390 పెరిగింది. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 54,650 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,990కి చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 54,800 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,780గా ఉంది.
– ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,500 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ. 59,450 వద్ద కొనసాగుతుంది.
– బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,450 వద్ద కొనసాగుతుంది.
– కోల్‌కతాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59, 450 గా ఉంది.

Gold
దేశ వ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ. 77,000 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ. 77వేలు, ముంబయిలో రూ. 73,500. ఢిల్లీలో 73,500. కోల్ కతాలో 73,500. బెంగళూరులో రూ.72వేలు, కేరళలో రూ. 77వేలు.