AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త.. వేలం వేయడానికి నిర్ణయం
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేసే ప్రక్రియను వేగవంతం చేసింది.
Good news for AgriGold victims Andhra Pradesh Government decides to auction 6,000 acres
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
- 6,330 ఎకరాలు వేలం వేయడానికి నిర్ణయం
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. అగ్రిగోల్డ్ కు చెందిన 6,330 ఎకరాలను వేలం వేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. సచివాలయంలో హోంమంత్రి అనిత అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిపాజిటర్ల ప్రయోజనాల పరరిక్షణపై సమగ్రంగా చర్చించారు. భూముల వేలం ప్రక్రియను ప్రారంభించాలని సీఐడీ, పోలీసు శాఖలను సబ్ కమిటీ ఆదేశించింది.
Also Read : AP Rain Alert : బలంగా ద్రోణి.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు వర్షాలు.. పిడుగులు పడే చాన్స్.. హెచ్చరికలు జారీ
ఈ విషయంపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ సంస్థకు 20,450 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామని, అందులో 6,330 ఎకరాలు బహిరంగ వేలంలో విక్రయించి ఆ డబ్బును బాధితులకు అందజేయాలని నిర్ణయించామని వివరించారు. ఆస్తుల వేలానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఈనెల 11 నాటికి ఖరారు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాక.. బాధితులకు న్యాయం చేసే ప్రక్రియను సెప్టెంబరు 15లోగా అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు.
తొమ్మిది రాష్ట్రాల్లోని డిపాజిటర్లకు బాండ్లు అందించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక సెల్స్, డిపాజిటర్ల సమాచారంకోసం ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తెస్తున్నాం. సెప్టెంబర్ 15 నాటికి బాండ్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విడతల వారిగా చెల్లింపులు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. న్యాయపరమైన చిక్కులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అగ్రిగోల్డ్ సంస్థ దేశవ్యాప్తంగా రూ.6వేల కోట్ల డిపాజిట్లు సేకరించింది. ఏపీ నుంచే రూ.3 వేల కోట్ల డిపాజిట్లు సేకరించింది. ఈ సంస్థకు దేశంలో 29,430 ఎకరాల స్థిరాస్తులు (భూములు) ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 20,450 ఎకరాలు ఉన్నట్లు గుర్తించాం. ఇందులో ప్రభుత్వానికి 14,304 ఎకరాలను సీఐడీ అప్పగించింది. ఈ నెల 15 నాటికి అగ్రిగోల్డ్ కోసం ప్రత్యే కంగా కేటాయించిన కోర్టు భవనాన్ని సిద్ధం చేస్తాం. దీనికి న్యాయ నిపుణులు, సిబ్బందిని వెంటనే కేటా యించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరతాం. ఏజెంట్ల వద్ద ఉండిపోయిన రూ.2వేల కోట్ల విలువైన బాండ్లను తిరిగి ఇవ్వాలని కోరామని మంత్రి మనోహర్ వెల్లడించారు.
