Gossip Garage: క్లైమాక్స్ లో లిక్కర్ ఫైల్స్ ఎపిసోడ్.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్.. నెక్స్ట్ అతడేనా?
ఎక్కడో మొదలైంది. ఇక్కడి దాకా వచ్చింది. మద్యం కుంభకోణం అని కూటమి సర్కార్ అన్న రోజు ఏం జరిగిందో ఎవరికి తెలియదు.

Gossip Garage: లింకులు తెగుతున్నాయ్. కథ క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఆరు నెలలుగా రోజుకో ట్విస్ట్..పూటకో మలుపు తిరుగుతూ వచ్చింది ఏపీ లిక్కర్ ఫైల్స్ ఎపిసోడ్. ఇప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అయింది. మద్యం కేసు మొదలైనప్పుడు అందులో ఏమీ లేదన్నప్పటి నుంచి..ఇంత జరిగిందా అనుకునే వరకు ఎన్నో డెవలప్‌మెంట్స్‌తో కాక పుట్టిస్తోంది లిక్కర్ కేసు. ఇప్పుడు చెవిరెడ్డి అరెస్ట్‌తో విచారణ తుది దశకు చేరుకున్నట్లేనంటున్నారు. ఇక అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న వైసీపీ ఎంపీ పేరును కూడా నిందితుల లిస్ట్‌లో చేరుస్తారని టాక్. అదే నిజమైతే నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది? ఒక్కొక్కరుగా అందరూ పక్కా ప్రూఫ్స్‌తో బుక్కవుతున్నారా?
ఎక్కడో మొదలైంది. ఇక్కడి దాకా వచ్చింది. మద్యం కుంభకోణం అని కూటమి సర్కార్ అన్న రోజు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అదో ఆరోపణ లాగే..అన్ని కేసుల లాగే అని పబ్లిక్ అనుకుని ఉండొచ్చు. ఎవరో తెలియని కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అరెస్ట్ తర్వాత..కేసేంటో..విచారణ ఏంటో కూడా అర్థం కానీ సిచ్యువేషన్. కానీ వరుస పెట్టి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి..ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించి..అందరి లింకులను బయటపెట్టి..కింగ్‌పిన్ ఎవరో ఓ అంచనాకు వచ్చిందట సిట్. అందులో భాగంగానే అసలు సూత్రధారుల అరెస్ట్ అంటూ రెండు మూడ్రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
లిక్కర్ సొమ్ము ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు అభియోగాలు..
అనుకున్నట్లే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. లిక్కర్ కేసులో చెవిరెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడును సిట్ అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇద్దరు కాకుండా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, అనుచరులు బాలాజీ యాదవ్, నవీన్ ను కూడా నిందితులుగా చేర్చారు. లిక్కర్ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు చెవిరెడ్డిపై అభియోగాలు మోపారు సిట్ అధికారులు.
లిక్కర్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరును మొదట ప్రస్తావించింది మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. సిట్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ అంతా కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డే చేశారంటూ విజయసాయి స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఆయనెవరన్న సెర్చింగ్ మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజులకే అరెస్టుల ఎపిసోడ్ స్పీడందుకుంది. A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసి విచారించి వరుస పెట్టి మిగతా నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇరికించే కుట్ర జరుగుతుందంటూ ముందే హడావుడి..
అయితే డిస్టలరీలు, మద్యం సప్లై కంపెనీల నుంచి వసూలు చేసిన డబ్బును వైసీపీ అభ్యర్థుల తరఫున చెవిరెడ్డి ఖర్చు చేసినట్లు అనుమానిస్తున్నారట. నవీన్, బాలాజీ యాదవ్ అనే తన అనుచరుల ద్వారా చెవిరెడ్డి నగదు తెప్పించి రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చినట్లు సిట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిందట. కొద్ది రోజుల క్రితమే తిరుపతికి చేరుకున్న సిట్ పోలీసులు చెవిరెడ్డి పాత్రపై విచారణ జరిపారట. ఈ క్రమంలోనే తనను లిక్కర్ కేసులో ఇరికించే కుట్ర జరుగుతుందంటూ చెవిరెడ్డి ముందే హడావుడి చేశారంటున్నారు టీడీపీ నేతలు.
చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడు అరెస్టుతో లిక్కర్ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరింది. కేసులో 39 మంది ప్రస్తుతానికి నిందితుల జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పేరును అక్యూస్డ్ లిస్ట్‌లో చేరుస్తారని అంటున్నారు. అయితే లిక్కర్ కేసులో మాజీ సీఎం వైఎస్ జగనే ఉన్నారంటూ అలిగేషన్స్ చేస్తూ వస్తోంది టీడీపీ. ఇప్పుడు జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా..ఆయనకు ఆప్తుడుగా ఉన్న చెవిరెడ్డిని అరెస్ట్ చేసింది. సేమ్‌టైమ్ జగన్‌కు సన్నిహితంగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్‌రెడ్డి పేరు కూడా అరెస్ట్ అయ్యే నేతల లిస్ట్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అసలు చెవిరెడ్డికి ముందే మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇంతలోనే బెంగళూరులో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక నెక్స్ట్ అరెస్ట్ జగన్‌కు సన్నిహితంగా ఉండే పెద్దిరెడ్డి కుటుంబం నుంచే ఉంటుందని అంటున్నారు. ఈ కేసులో మిథున్‌రెడ్డి అయితే.. ఆల్‌మోస్ట్ దర్యాప్తు ముగిసినట్లేనంటున్నారు. ఆ తర్వాత విచారణ ముగిసి కోర్టులో కేసు ట్రయల్ నడవనుంది. లిక్కర్ కేసులో కీలక అరెస్టులతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఆందోళన కంటిన్యూ అవుతోంది.