Gossip Garage: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. రంగంలోకి ఈడీ.. నెల రోజుల్లో బ్లాస్టింగ్ న్యూస్? ఓ పెద్ద నేత అరెస్ట్?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏం జరిగిందో..నిందితులు బెయిల్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలియనిది కాదు.

Gossip Garage: సిట్ దర్యాప్తు నడుస్తూనే ఉంది. ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. ఏకంగా ఓ ఎంపీ జైలుకెళ్లారు. కనిపించకుండా పోయిన ఆ తొమ్మిది మందిని రప్పించే స్కెచ్ వేస్తున్నారు. నెక్స్ట్ ఓ పెద్ద నేత వంతు రావడం పక్కా అంటున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో ఈడీ ఎంటర్ అయింది. దీంతో ఏపీ లిక్కర్ కేసు మరింత పీక్ లెవల్‌కు చేరుకుంది. ముడపుల వ్యవహారంపై కూపీ లాగేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో..వేడి రాజుకుంటోంది. ఏపీ లిక్కర్ కేసు ఇంకా స్ట్రాంగ్ కానుందా.? ఈడీ రాకతో నిందితులకే కష్టకాలమేనా.?
ఏపీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలంటూ ఆరోపణలున్న ఈ కేసులో ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మరోవైపు కొందరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సిట్. విదేశాలకు వెళ్లిపోయిన వారిని రప్పించేందుకు అవసరమైతే ఇంటర్‌పోల్ హెల్ప్ తీసుకునే ప్లాన్ చేస్తోందట సిట్. కేసులో కీలకమైన 12 మంది అరెస్టు అయ్యారు. 9 మంది కీలక నిందితులు విదేశాలకు వెళ్లిపోయారు.
లిక్కర్ స్కామ్‌లో కీ రోల్ ప్లే చేశారని అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచే బిగ్‌బాస్‌గా చెప్తున్న వ్యక్తి చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోందన్న ప్రచారం మొదలైంది. ఇంకో నెల రోజుల్లోనే అసలు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను ఈ కేసులో రౌండప్ చేస్తారని ఇన్ సైడ్ టాక్. సరిగ్గా ఇదే టైమ్‌లో ఈ కేసులో ఈడీ ఎంటర్ అయింది. శర్వాణీ ఆల్కో బ్రూ కంపెనీ డైరెక్టర్ చంద్రారెడ్డిని విచారణకు పిలిచింది.
వైసీపీ హయాంలో భారీగా లిక్కర్ ఆర్డర్లు పొందిన కంపెనీల్లో శర్వాణీ సంస్థ ఒకటి అంటున్నారు. ఈ వివరాలను సిట్ చార్జిషీటులో ప్రస్తావించిందట. శర్వాణీ కంపెనీ డైరెక్టర్ చంద్రారెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డితో సహా పలువురు వైసీపీ నేతలతో సంబంధాలున్నాయంటున్నారు. సిట్ పలుసార్లు ఆయనకు నోటీసులు ఇచ్చినా విచారణకు రాలేదు. ఇప్పుడు..అదే చంద్రారెడ్డికి ఈడీ నుంచి పిలుపు వచ్చింది. అయితే ఈ స్టేజ్‌లో లిక్కర్ వ్యవహారంలో ఈడీ ఎంటర్ అవడం అతిపెద్ద డెవలప్‌మెంట్‌గా చెప్పొచ్చు.
ఇన్నాళ్లూ సిట్ దర్యాప్తు సాగుతుండగా, ఈడీ ఎందుకు జోక్యం చేసుకోలేదని టీడీపీ ప్రశ్నిస్తూ వచ్చింది. బీజేపీ వైసీపీ పెద్దలను కాపాడుతోందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే PMLA కింద ఇప్పుడు ఈడీ దర్యాప్తు స్టార్ట్ చేయడంతో ఈ అనుమానాలకు తెరపడినట్లయింది. శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు జారీతో లిక్కర్ వ్యవహారంలో మనీ లాండరింగ్‌పై ఈడీ ఫోకస్ పెట్టింది.
Also Read: దారిలోకి రాకపోతే టికెట్ కట్? ఎమ్మెల్యేలను సెట్ రైట్ చేసే పనిలో చంద్రబాబు..
ఇప్పటికే లిక్కర్ కేసు ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. మిథున్‌రెడ్డి అరెస్ట్‌తో వైసీపీలో ఆందోళన ఇంకా ఎక్కువందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ కేసుపై సిట్ పూర్తిస్థాయి చార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో..ఈ స్టేజ్‌లో ఈడీ ఎంటర్ అయిందంటే ఈ కేసు మరింత జఠిలంగా మారే అవకాశం కనిపిస్తోంది. సిట్ అలిగేషన్స్ నుంచి తప్పించుకుని బెయిల్ తెచ్చుకున్నా..ఈడీ కేసులు మాత్రం నిందితులకు తలనొప్పిగా మారడం పక్కా. మనీలాండరింగ్ అంటూ ఈడీ కేసు పెడితే నిందితులు మరింత ఇరకాటంలో పడిపోయినట్లే. బెయిల్ దొరకడం కూడా అంత ఈజీ కాదు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏం జరిగిందో..నిందితులు బెయిల్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలియనిది కాదు. అయితే అసలు సూత్రధారి అరెస్ట్ ఒక్కటే బాకీ ఉందంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఈడీ రాక వైసీపీలో గుబులు పట్టిస్తోందట. వైసీపీ బిగ్‌బాస్‌ను ఈడీ కేసులో ఇరికించే కుట్ర జరుగుతుందన్నది వైసీపీ అనుమానం.
ఈడీ దర్యాప్తు స్పీడప్ అయితే..ఈ కేసు ఎవరి టార్గెట్‌గా ముందుకు కదులుతుందనేది మరింత క్లారిటీ రానుంది. ఇప్పటికైతే ఆరోపణలు ఎదుర్కొన్న కీలక వ్యక్తులు అందరూ అరెస్ట్ అయ్యారు. ఇక ఒక్కరిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారని అంటున్నారు టీడీపీ నేతలు. మరో నెల రోజుల్లో బ్లాస్టింగ్ న్యూస్ రాబోతుందా? ఈడీ వేట ఎలా ఉండబోతుందనేది చూడాలి.