Gossip Garage: దారిలోకి రాకపోతే టికెట్ కట్? ఎమ్మెల్యేలను సెట్ రైట్ చేసే పనిలో చంద్రబాబు..

పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను మీడియాకు కూడా వివరిస్తున్నారు.

Gossip Garage: దారిలోకి రాకపోతే టికెట్ కట్? ఎమ్మెల్యేలను సెట్ రైట్ చేసే పనిలో చంద్రబాబు..

Updated On : July 24, 2025 / 9:39 PM IST

Gossip Garage: ఇది మీ పనితీరు. ఇవిగో మీ మీద వచ్చిన ఆరోపణలు. కార్యకర్తలు మీపై చేస్తున్న ఫిర్యాదులు ఇవి. నియోజకవర్గంలో కంటే బయటే ఎక్కువగా ఉంటున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయిమంటే అంత బద్దకం ఎందుకు? అంటూ ఎమ్మెల్యేల ప్లస్‌లు, మైనస్‌లపై ప్రోగ్రెస్ కార్డు ఇస్తున్నారు సీఎం చంద్రబాబు. రోజుకు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలతో వన్ టు వన్‌ భేటీ అవుతూ..ఎలా పని చేస్తున్నారు..ఇంకా ఎలా పనిచేస్తే పొలిటికల్ ఫ్యూచర్‌ బాగుంటుందనే దానిపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఉన్న ఎమ్మెల్యేలను సెట్ చేస్తారా? దారిలోకి రాకపోతే టికెట్ కట్టేనా?

మీరు బాగా పనిచేస్తే..పార్టీకి మేలు. మీ పొలిటికల్ ఫ్యూచర్ బాగుంటుంది. మళ్లీ మళ్లీ గెలిచి అసెంబ్లీకి రావొచ్చు. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా మిగిలిపోతామంటే మీ ఇష్టం. అంటూ ఎమ్మెల్యేలకు పదే పదే వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే పలుసార్లు ఎమ్మెల్యేలతో భేటీ అయి..అలర్ట్ చేస్తూ..వార్నింగ్‌లు ఇస్తూ వచ్చిన చంద్రబాబు..ఇప్పుడు ఏకంగా వన్‌ టు వన్‌ మీటింగ్‌లు పెట్టుకున్నారు.

ఇప్పటివరకు 21మంది ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అయిన సీఎం..ఎమ్మెల్యేల పనితీరు..వారి మీద వచ్చిన ఆరోపణలు..క్యాడర్‌కు అందుబాటులో ఉన్న తీరు..ప్రభుత్వ పథకాలపై ప్రచారం వంటి వాటిపై ఆరా తీశారట. తనకు ఉన్న ఇన్ఫర్మేషన్, గ్రౌండ్‌ రిపోర్ట్ ప్రకారం ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారట. ఎమ్మెల్యేల అనుకూలతలు, ప్రతికూలతలను బేరీజు వేస్తూ..పనితీరులో ఎలాంటి మార్పులు చేసుకోవాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారట.

నియోజకవర్గాల వారీగా ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలపై సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నారట. ఇప్పటివరకు 21 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశాలు పూర్తయ్యాయి. రోజుకు ఇద్దరు లేదా ముగ్గురు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యేలతో దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమవుతున్నారు. ఎమ్మెల్యేలు పనితీరు ఇంకా మెరుగుపరచుకోవాలని సూచిస్తున్నారు. ముందుగా కాస్త వెనుకబడ్డారనుకున్న ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్నారని అంటున్నారు.

బాగా పని చేస్తున్న వారిని అభినందిస్తుండటంతో పాటు..లోపాలున్న చోట మొహమాటం లేకుండా సరిదిద్దుకోవాలని చెబుతున్నారు చంద్రబాబు. కొన్ని నియోజకవర్గాల్లో అవినీతి ఆరోపణలు, పార్టీ కార్యకర్తలతో సఖ్యత లేని చోట అంతా సరి చేసుకోవాలని సూచిస్తున్నారు. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా ఉంటున్న కొందరు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను మీడియాకు కూడా వివరిస్తున్నారు.

Also Read: జగన్‌ను అరెస్ట్ చేయడమే టార్గెట్.. ఆ కేసు ఓ కట్టుకథ, నిలబడదు- సజ్జల సంచలన వ్యాఖ్యలు

పలువురు ఎమ్మెల్యేలకు 60 నుంచి 65 శాతం మేరకే ప్రజా సంతృప్తి ఉన్నట్లుగా రిపోర్ట్ అందడంతో వారికి స్పెషల్‌గా క్లాస్ తీసుకుంటున్నారట. ముఖ్యంగా కొత్త ఎమ్మెల్యేలకు, ఫస్ట్ టైమ్ గెలిచిన వారికి పదే పదే హితబోధ చేస్తున్నారు చంద్రబాబు. వన్‌ టైమ్‌ ఎమ్మెల్యేలుగా మిగలొద్దని చెబుతూ వస్తున్నారు. ప్రజలు, కార్యకర్తలతో మమేకం కావాలని పదేపదే చెబుతున్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి క్లాస్ తీసుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. పనితీరులో మార్పు రావాలని, లేకపోతే అవసరమైన మార్పులు, చేర్పులు తప్పవని సీరియస్ వార్నింగ్సే ఇస్తున్నారట.

ఇదే సమయంలో శాసనసభ్యులపై వస్తున్న ఆరోపణలకు సంబంధించిన వివరాలను కూడా వారి ముందు పెట్టి వివరణ తీసుకుంటున్నారట. అనవసర విషయాల జోళికి వెళ్లొద్దని, అడ్డగోలుగా బిహేవ్ చేస్తే ఎవరి విషయంలోనైనా వెనుకాడేది లేదని తేల్చి చెబుతున్నారు. గాడి తప్పినా..పార్టీ లైను క్రాస్ చేసినా యాక్షన్ తప్పదని ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలో మరికొందరి ఎమ్మెల్యేలతో వన్ టు వన్ భేటీ కానున్నారు. సింగపూర్ పర్యటన తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇస్తున్నా..సర్కార్ నడుపుతున్న పెద్దలుగా ఎంత బాగా పనిచేస్తున్నా..ఎమ్మెల్యేల పనితీరు చాలా కీలకమని భావిస్తున్నారట చంద్రబాబు. లోకల్‌గా ఎమ్మెల్యేకు మంచి పేరు లేకపోయినా..ఆయన పబ్లిక్‌లో ఉండకపోయినా..క్యాడర్‌ సమస్యలు పరిష్కరించకపోయినా.. తేడా కొట్టొచ్చని అంచనా వేస్తున్నారట. అందుకే ముందుగానే అలర్ట్ అయి ఎమ్మెల్యేలను సెట్‌రైట్ చేసే పనిలో పడ్డారట చంద్రబాబు.

ఇప్పుడు కూడా ఎంత అలర్ట్ చేయాలో అంత అలర్ట్ చేస్తున్నామ్. ఏం సహకారం కావాలో చెప్పండి చేస్తామంటున్నామ్. అయినా కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా తిరుగుతామంటే ఇక మీ ఇష్టం. మంచి మార్కులు రాకపోతే టికెట్‌ కట్‌ చేయడానికి కూడా వెనకాడబోనని..ఇదే ఫైనల్ వార్నింగ్ చెప్తున్నారట. ఇప్పటికీ మించిపోయిందేమి లేదంటున్న బాబు..పద్దతి మార్చుకుని బాగా పనిచేయండి..మంచి ఫ్యూచర్ ఉంటదని భరోసా ఇస్తున్నారట. బాబు హితబోధతో అయినా ఎమ్మెల్యేల తీరులో మార్పు వస్తుందా లేదా అనేది చూడాలి.