Bolisetti Srinivas: జనసేన ఎమ్మెల్యేపై బొలిశెట్టికి అవినీతి సెగ..! తెరవెనుక కుట్రలు చేస్తున్నదెవరు?
తన మార్క్ చూపించేందుకు ఎమ్మెల్యే ఆరాటపడుతుండగా..ఆయనకు పేరు రాకుండా కొందరు కావాలని పనిగట్టుకుని అడ్డంకులు సృష్టిస్తున్నారట. అవినీతి ఆరోపణలతో తన ఇమేజ్ను తగ్గించే కుట్ర జరుగుతుందనేది ఎమ్మెల్యే బొలిశెట్టి అనుమానట.
- బొలిశెట్టిపై కరప్షన్ అలిగేషన్స్ వెనుకున్నదెవరు.?
- ఎమ్మెల్యే సెంట్రిక్‌గా సోషల్ మీడియాలో పోస్టుల వార్
- ముగ్గురు నేతలు..రెండు పార్టీలు..టార్గెట్ ఒకటే అన్నట్లు ఫైట్
Bolisetti Srinivas: ఔనంటే కాదనిలే. కాదంటే ఔననిలే. ఇదో పాత సినిమా సాంగ్ లైన్ అయినా..తాడేపల్లిగూడెం పాలిటిక్స్ మాత్రం అచ్చం ఇలాగే ఉన్నాయట. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే బొలిశెట్టిని పొగుడుతూనే..తెరవెనుక సెగ రాజేస్తున్నారట. ఈ క్రమంలోనే ఆయనపై కరప్షన్ అలిగేషన్స్ చక్కర్లు కొడుతున్నాయట. సొంత పార్టీ నేతలే తనను టార్గెట్ చేశారో..లేక ప్రత్యర్థులు సెగ పెడుతున్నారో తెలియక ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే.? ఆయనపై అవినీతి అస్త్రాన్ని ప్రయోగిస్తున్న అదృశ్య శక్తులు ఎవరు.?
తాడేపల్లిగూడెంలో..భగభగ మండే భానుడిని మించి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ జనసేన ఎమ్మెల్యేపై పెరుగుతున్న రాజకీయ వ్యతిరేకత చర్చనీయాంశంగా మారింది. సొంత గూటిలోనే MLAకు సెగ తగులుతుందా..లేదా ఎమ్మెల్యే పనితీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోందా? లేక లోలోపల గ్రూపు పాలిటిక్స్ నడుస్తున్నాయా? అనేది నియోజవర్గంలో ఎవరికి అర్థం కాని ప్రశ్నగా మిగిలింది.
తెరవెనుక కుట్రలు చేస్తున్నది కూటమి నేతలా? వైసీపీ నాయకులా?
తన మార్క్ చూపించేందుకు ఎమ్మెల్యే ఆరాటపడుతుండగా..ఆయనకు పేరు రాకుండా కొందరు కావాలని పనిగట్టుకుని అడ్డంకులు సృష్టిస్తున్నారట. అవినీతి ఆరోపణలతో తన ఇమేజ్ను తగ్గించే కుట్ర జరుగుతుందనేది ఎమ్మెల్యే బొలిశెట్టి అనుమానట. అయితే ఈ తెరవెనుక కుట్రలు చేస్తున్నది కూటమి నేతలేనా? లేక వైసీపీ లీడర్లు ఉన్నారా అనేది ఎమ్మెల్యేకు అంతుచిక్కట్లేదట. దీంతో నిఘా వర్గాలతో జనసేన అధిష్టానం విచారణ చేయిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. జనసేన అధినేత ఎంతో ఇష్టంగా బాహుబలి అని పిలుచుకునే నేత అయిన ఎమ్మెల్యే బొలిశెట్టి టార్గెట్‌గా బ్లేమ్ గేమ్ ఆడుతున్నదెవరో క్లారిటీ రావడం లేదట. ఆయనపై ఆకాశ రామన్న ఉత్తరాలను సృష్టిస్తున్నదెవరో కూడా తెలియట్లేదట. జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు కూడా ఎవరికి వారు తమ ఎమ్మెల్యే మంచి వారు, అవినీతిపరుడు కాదని..అభివృద్ధిపైనే ప్రత్యేకించి దృష్టి పెట్టారంటూ చెప్పుకు రావడం కూడా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఓ కన్నేసి పెట్టిన ఎమ్మెల్యే..అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదంటున్నారట. కొంతమంది తనపై ఆకాశ రామన్న ఉత్తరాలతో.. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ అవినీతి మరకలు అంటిస్తున్నారని ఎమ్మెల్యేనే చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే తనపై వస్తున్న అలిగేషన్స్‌ను లైట్ తీసుకుంటున్న జనసేన ఎమ్మెల్యే..తన పని తాను చేసుకుంటూ పోతానంటున్నారట. అయితే తాడేపల్లిగూడెంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే ఒకవైపు పార్టీలో అంతర్గత విభేదాలంటూ ప్రచారం జరుగుతుంటే..మరోవైపు కూటమి నేతల మధ్య కోఆర్డినేషన్ లోపించిందనే టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు వస్తుండటం వెనుక పెద్ద ప్లానే ఉందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. తాను పోతే, తన తర్వాత ఎమ్మెల్యే అవుతానంటూ కొందరు చెప్పుకుంటున్నారంటూ గతంలో ఎమ్మెల్యే బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. టీడీపీ ఇంచార్జ్ వలవల బాబ్జీని ఉద్దేశించే బొలిశెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అప్పట్లో చర్చ జరిగింది. పెద్దలు జోక్యం చేసుకోవడం, ఇద్దరి మధ్య రాజీ చేయడం, ఆ తర్వాత వలవల బాబ్జీకి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పదవి ఇవ్వడంతో, అంతా సెట్ అయిపోయిందనుకున్నారట. కానీ.. బొలిశెట్టి శ్రీనివాస్‌ను కాదని..తానే ఎమ్మెల్యేను అన్నట్లుగా అధికారులను, లీడర్లను బెదిరిస్తున్నారంటూ బాబ్జీ మీద ఆరోపణలు చేస్తున్నారు జనసేన నేతలు.
మొత్తానికి తాడేపల్లిగూడెంలో రాజకీయం ఇప్పుడు ‘ముగ్గురు నేతలు-రెండు పార్టీలు-ఒకే లక్ష్యం అన్నట్టుగా మారిందంటున్నారు. ఎమ్మెల్యేపై అవినీతి ముద్ర వేసేందుకు ఒక వర్గం గట్టిగానే ప్రయత్నిస్తోందట. తాడేపల్లిగూడెంలో కూటమి నేతల్లోనే విభేదాలను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సడెన్ షాక్.. సర్ప్రైజ్ రైడ్స్‌తో నిందితులకు ఝలక్
