Pawan Kalyan: దక్షిణాదిపై జనసేన గురి.. పవన్ కల్యాణ్ వ్యూహం ఇదేనా? జాతీయ రాజకీయాలవైపు అడుగులు అందుకేనా?
జనసేన పార్టీ ప్రస్తుతం ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. పార్టీ పెట్టి 12 ఏళ్లయినా..ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణం జరగలేదు. గత ఎన్నికల్లో 21 అసెంబ్లీ సీట్లలో మాత్రమే పోటీ చేసి..ఆ 21 సీట్లలో గెలిచింది జనసేన.
- తెలంగాణ, ఏపీ తర్వాత..సౌత్‌పై ఫోకస్ పెట్టిన సేనాని
- మొన్న కేరళ..నేడు కర్ణాటక..నెక్స్ట్ తమిళనాడు..!
- ఏపీలో జనసేన పూర్తిస్థాయి బలోపేతానికి ప్లాన్స్..
Pawan Kalyan: మొన్న కేరళ..నేడు కర్ణాటక, ఎల్లుండి తమిళనాడు..మరి ఏపీ సంగతేంటి..? సొంత రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టకుండా..ఇతర రాష్ట్రాల్లో జనసేన యాక్టివిటీ స్పీడప్ చేయడానికి రీజనేంటి.? ఏపీలో కూటమిలోనే ఉంటూ..మిగతా స్టేట్స్లో సింగిల్‌గా బలపడే ప్లాన్ ఉందా.? పవన్ పొలిటికల్ వ్యూహాల వెనుకున్న ఫ్యూచర్ ప్లానేంటి.? ఏపీలో పార్టీకి బలమైన పునాదులు వేసేలా బ్యాగ్రౌండ్ వర్క్ నడుస్తోందా.? గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం వేస్తున్న మాస్టర్ స్కెచ్ ఏంటి.?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, ఇప్పుడు తెలుగ స్టేట్స్ను దాటి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, పార్టీ సెక్రటరీ రామ్ తాళ్లూరికి పార్టీ విస్తరణ బాధ్యతలు అప్పగించారు పవన్. ఇప్పటికే కేరళ, కర్ణాటకలో సమావేశాలు పెట్టారు. త్వరలో తమిళనాడులోనూ సమావేశం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఆయా రాష్ట్రాల్లో జనసేన విస్తరణకు డిమాండ్ వస్తుందని అక్కడి ప్రజలు నాయకులు జనసేనను కోరుకుంటున్నారని చెబుతున్నారు. పక్క రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ సన్నాహాలపై పార్టీ నేతల్లో సీరియస్ చర్చ జరుగుతుందట. రాజకీయంగా పార్టీకి మంచి భవిష్యత్ ఉన్న ఏపీలో సీరియస్ ఫోకస్ చేయకుండా పక్క రాష్ట్రాల్లో జనసేన సమావేశాలు ఎందుకనే చర్చ జరుగుతోందట.
జనసేన పార్టీ ప్రస్తుతం ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. పార్టీ పెట్టి 12 ఏళ్లయినా..ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణం జరగలేదు. గత ఎన్నికల్లో 21 అసెంబ్లీ సీట్లలో మాత్రమే పోటీ చేసి..ఆ 21 సీట్లలో గెలిచింది జనసేన. ఇంకా అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే..ఇక్కడే పార్టీ బలోపేతం కోసం ఎన్నో వ్యూహాలు రచించాల్సి ఉంది. పైగా ఇప్పుడు కూటమిలో ఉన్నా..ఎప్పుడో ఓసారి జనసేన సొంతంగా పోటీ చేసే పరిస్థితి రావొచ్చని..అప్పుడు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేలా ప్రణాళికలు ఉండాలని కోరుకుంటున్నారు జనసేన కార్యకర్తలు.
స్టేట్ ఏదైనా కింగ్ మేకర్‌గా ఉండాలన్నదే పవన్ ప్లాన్..!
ఏపీలో ఉత్తరాంధ్ర టు రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లో పార్టీ బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సభ్యత్వ నమోదు కొనసాగుతున్నా..రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు పూర్తి కాలేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కమిటీలు అనుబంధ విభాగాలు అంటూ హడావిడి జరుగుతున్నా ఆచరణలో పెట్టడం లేదనేది ఆ పార్టీ నేతల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడే ఏపీలో పార్టీని పటిష్టం చేస్తే బాగుంటుందని సీనియర్లు సూచిస్తున్నారట. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఏపీని కాదని..కేరళ, కర్ణాటక, తమిళనాడులో విస్తరించేలా సమావేశాలు పెట్టడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అధిష్టానం పెద్దలు మాత్రం ఈ విస్తరణ వెనుక వ్యూహం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఏపీలో అయినా..ఏ స్టేట్‌లో అయినా కింగ్ మేకర్‌గా ఉండాలన్నదే ప్లాన్‌గా చర్చించుకుంటున్నారు జనసేన లీడర్లు.
పవన్ కల్యాణ్ తన బాల్యం, విద్యాభ్యాసం, సినిమాల్లోకి రాకముందు ఎక్కువ కాలం చెన్నైలోనే గడిపారు. దీంతో ఆయనకు అక్కడి సామాజిక, రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని చెబుతున్నారు. తమిళ సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులతో పవన్‌కు ఉన్న వ్యక్తిగత సంబంధాలను పార్టీ బలోపేతానికి వాడుకోవాలని జనసేన భావిస్తోందట.. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పవన్‌కు అభిమాన గణం ఉంది. ఈ క్రేజ్‌ను ఓటు బ్యాంకుగా మలిచే వ్యూహంతో పార్టీ ముందుకు వెళ్తోందట.
జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలనే వ్యూహం…
జనసేన విస్తరణ మాస్టర్ ప్లాన్ కేవలం ఒకట్రెండు రాష్ట్రాలకే పరిమితం కాదని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటికే కేరళలో యూనిట్ పనులు ప్రారంభం కాగా, త్వరలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా పార్టీ యాక్టివిటీ స్టార్ట్ చేయనున్నారట. సౌత్‌లో పట్టు సాధించిన తర్వాత, ఉత్తరాది రాష్ట్రాలపై కూడా దృష్టి పెట్టబోతున్నారట. జనసేనను జాతీయ పార్టీగా మార్చడమే పవన్ కల్యాణ్ లక్ష్యంగా చెప్పుకుంటున్నారు. ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉంటూనే..మరోవైపు జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలనేది వ్యూహం అంటున్నారు.
Also Read: తమిళనాడులో కింగ్ మేకర్‌గా విజయ్..? టీవీకే పార్టీ కీలక సమావేశం.. 17-సి ఫారాలు ఎందుకు?
