ఏపీ లిక్కర్ ఫైల్స్ లో బిగ్ ట్విస్ట్.. అట్టపెట్టెల్లో కోట్లు..! నెక్స్ట్ వారి అరెస్ట్ ఖాయమా?
ఇక నెక్స్ట్ అరెస్ట్‌కు పెద్ద గ్యాప్ ఉండకపోవచ్చని అంటున్నారు. త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రచారంలో ఉన్న వారిలో ఇద్దరు వైసీపీ అగ్రనేతల వంతు కూడా రావొచ్చంటున్నారు.

Gossip Garage: 9 నెలల కింద సిట్ ఎంటర్ అయింది. ఆ తర్వాత లిక్కర్ కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. మూడు నెలలుగా వరుస పెట్టి అరెస్టులు నడుస్తున్నాయ్. లాస్ట్‌కు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని కూడా సిట్ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ఆ తర్వాత మూమెంటమ్ ఇంకా స్పీడప్ అయినట్లు కనిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ కేసును పూర్తిగా కోర్టు మెట్లెక్కించే ప్రయత్నం జరుగుతోంది. అంతిమ లబ్ధిదారుడని చెప్తున్న వ్యక్తి టార్గెట్‌గా..పకడ్బందీగా ఆధారాలు, నగదు సీజ్‌తో లిక్కర్ కేసును సిట్ మరింత స్ట్రాంగ్ చేస్తుదంటున్నారు.
ఇప్పటివరకు స్కామ్ లేదు..లావాదేవీలు లేవు..అంతా ట్రాన్సపరెంట్‌గా జరిగిందని..తమను ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు వైసీపీ అగ్రనేతలు. లిక్కర్ కేసు నిందితుల అకౌంట్లు, వారి కంపెనీలకు సంబంధించి సిట్ ఇప్పటికే 62.85 కోట్లు విలువ చేసే నగదు, ఇతర వస్తువులను సీజ్ చేసింది. ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌లో 11 కోట్ల రూపాయలు పట్టుకుంది. సేమ్‌టైమ్‌లో ఏ4గా ఉన్న వరుణ్‌ను అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో ఏ1గా ఉన్న రాజ్‌కసిరెడ్డి ఇచ్చిన ఇన్ఫోతోనే..వరుణ్ అరెస్ట్‌తో నగదు సీజ్ జరిగిందని అంటున్నారు.
హైదరాబాద్ శివార్లలోని ఓ గెస్ట్ హౌస్ లో అట్టపెట్టెల్లో దాచిన నోట్ల కట్టలను ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర శివార్లలోని కాచారం గ్రామంలో సులోచన ఫార్మ్ హౌస్ లో భారీగా నగదు దాచినట్లు అందిన పక్కా సమాచారంతో దాడులు చేసి నగదు సీజ్ చేశారు. ఈ డబ్బు లిక్కర్ స్కాంలో వచ్చిన కమీషన్ డబ్బుగా పోలీసులు చెబుతున్నారు. ఏ40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ పోలీసులు సులోచన ఫార్మ్ హౌస్‌లో తనిఖీ చేయగా 12 అట్ట పెట్టెల్లో రూ.11 కోట్లు నగదు బయటపడింది.
భారీగా నగదు లభించడంతో లిక్కర్ స్కామ్‌లో సిట్‌కు పెద్ద ఆధారం దొరికినట్లు అయింది. అంతేకాకుండా సిట్ మొదటి నుంచి చెబుతున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున నగదు చేతులు మారిందని ఈ ఘటన రుజువు చేసిందని అంటున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఏ40 వరుణ్ ప్రధాన అనుచరుడుగా చెబుతున్నారు. వరుణ్‌తో పాటు ఇదే కేసులో మరో ఏ12 చాణక్య లిక్కర్ స్కాంలో కమీషన్ డబ్బు వసూలు చేసేవారని సిట్ పోలీసులు చెబుతున్నారు.
Also Read: జగన్‌ను అరెస్ట్ చేసి.. వైసీపీని నిర్వీర్యం చేసేందుకు.. చంద్రబాబు కుట్ర- పేర్ని నాని
ఈ ఇద్దరిని గతంలోనే అరెస్టు చేయగా, కమీషన్ కోసం వసూలు చేసిన డబ్బుపై ప్రశ్నించడంతో ఈ డంప్ బయటపడినట్లు తెలుస్తోంది. అయితే దొరికిన డబ్బు తమదని నిందితులు ఒప్పుకోకపోవచ్చు. తాము ఎలాంటి సమాచారం ఇవ్వకున్నా భయపెట్టి సంతకాలు చేయించారని కూడా రివర్స్ అలిగేషన్స్ చేయొచ్చు. ఈ నగదు సీజ్‌తోనే అంతా జరిగిపోతుందని అనుకోవడానికి అవకాశం ఏం లేదు. కానీ సిట్‌కు ఇదొక అస్త్రంగా మారొచ్చంటున్నారు.
లిక్కర్ కేసులో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ రాబోతుందన్న ఊహాగానాలకు ఈ డెవలప్‌మెంట్స్ బలం చేకూరుస్తున్నాయి. పెద్దఎత్తున నగదు దొరకడంతో కీలక మలుపు తిరిగినట్లు అయింది. ఇప్పటివరకు అకౌంట్లలో ఉన్న బ్యాలెన్స్, ఆస్తులను, వస్తువులను జప్తు చేశారు సిట్ అధికారులు. ఇప్పుడు ఏకంగా 11 కోట్ల రూపాయల నగదు దొరికింది. ఇది కీలక ఆధారంగా..స్కామ్ జరిగిందని ప్రూవ్ చేయడానికి సిట్‌కు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ పరిణామాలను బట్టి చూస్తే లిక్కర్ కేసులో త్వరలో పెద్ద తిమింగలం అరెస్ట్ పక్కా అంటూ టీడీపీ ఇస్తున్న లీకులు నిజం కాబోతున్నాయన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేసింది సిట్. లిక్కర్ వ్యవహారంలో ఆయనే కీలక సూత్రధారుడని మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోన్న సిట్..9 నెలల తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసింది. ఇక నెక్స్ట్ అరెస్ట్‌కు పెద్ద గ్యాప్ ఉండకపోవచ్చని అంటున్నారు. త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రచారంలో ఉన్న వారిలో ఇద్దరు వైసీపీ అగ్రనేతల వంతు కూడా రావొచ్చంటున్నారు.
వైసీపీ అధినేత, ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉండే వ్యక్తి..ఆ ఇద్దరికి ఉచ్చు బిగించే కార్యక్రమం వేగంగా జరుగుతోందన్న ప్రచారం బయలుదేరింది. అయితే అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని..ఇంకా ఆధారాలు రాబట్టాల్సి ఉందని అంటున్నారు కూటమి పెద్దలు. త్వరలో మిథున్‌రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించి..ఆ తర్వాత కింగ్‌పిన్‌గా ఆరోపిస్తున్న నేతలకు నోటీసులు ఇస్తారన్న టాక్ నడుస్తోంది. ఏదైనా హైదరాబాద్ శివారులో దొరికిన నగదుతో లిక్కర్ కేసు మరో టర్న్ తీసుకోవడం పక్కా. నెక్స్ట్ సిట్ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి.