Perni Nani: జగన్‌ను అరెస్ట్ చేసి.. వైసీపీని నిర్వీర్యం చేసేందుకు.. చంద్రబాబు కుట్ర- పేర్ని నాని

ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి మీకు అనుకూలంగా మారగానే అమాయకుడు అయిపోయాడు అని పేర్ని నాని అన్నారు.

Perni Nani: జగన్‌ను అరెస్ట్ చేసి.. వైసీపీని నిర్వీర్యం చేసేందుకు.. చంద్రబాబు కుట్ర- పేర్ని నాని

Updated On : July 30, 2025 / 4:27 PM IST

Perni Nani: ఏపీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ ను అరెస్ట్ చేసి వైసీపీని నిర్వీర్యం చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉదయం నుండి జగన్ ఏదో నేరం చేసేసినట్టు హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో ఏవో దొరికితే జగన్ కి సంబంధం ఏంటి..? అని పేర్ని నాని ప్రశ్నించారు. సిట్ చెప్పిన అపార్థంతో టీడీపీ మీడియా హడావిడి చేస్తోందన్నారు. రాజ్ కేసిరెడ్డి మీతో కుమ్మక్కయ్యాడు కనకే కదా దర్జాగా ఎయిర్ పోర్టుకి వచ్చాడు అని పేర్ని నాని అన్నారు. వాసుదేవరెడ్డి, విజయసాయిరెడ్డి కీలకం అన్నారు.. మీకు అనుకూలం అయ్యాక అమాయకులు అయిపోయారని ధ్వజమెత్తారు. ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి మీకు అనుకూలంగా మారగానే అమాయకుడు అయిపోయాడు అని పేర్ని నాని అన్నారు.

”అక్రమ మద్యం కేసులో ఆధారాలు లేవు. 100 రోజుల క్రితం రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఏ డబ్బు దొరికినా మద్యం కేసుకు లింకు పెడుతున్నారు. చంద్రబాబు హయాంలో మద్యం వ్యాపారంలో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. వైసీపీ హయాంలో అమ్మిన ప్రతి మద్యం బాటిల్ పై క్యూఆర్ కోడ్ ఉంది. లెక్క ప్రకారం డబ్బులు చేయకుంటే మా ప్రభుత్వంలో అరెస్ట్ లు చేశాం” అని పేర్నినాని తెలిపారు.

Also Read: గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. 12 పెట్టెల్లో రూ.11 కోట్లు.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం..