Gossip Garage : ఈసారి ఏ బాంబు పేలుస్తారో..! వైసీపీలో విజయసాయిరెడ్డి టెన్షన్..
మొన్నటి విచారణలో ఆయన సీఐడీకి ఏం చెప్పారు..నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారనేదే వైసీపీ లీడర్లను కలవరపెడుతోందట. మీడియాకే కావాల్సినంత స్టఫ్ ఇస్తున్న విజయసాయి ఇక సీఐడీకి ఏమేం చెప్పారోనన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.

Gossip Garage : ఆయనకు మళ్లీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఓసారి విచారణకు హాజరై కోటరీ అంటూ కీలక కేసులపై హాట్ కామెంట్స్ చేసి అందరినీ టెన్షన్ పెట్టారాయన. ఇప్పుడు మళ్లీ సీఐడీ విచారణకు అటెండ్ అయితే ఏం బాంబ్ పేలుస్తారోనన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఫ్యూచర్‌లో అన్నీ చెబుతానని ఇప్పటికే హింట్ ఇచ్చిన ఆ మాజీ ఎంపీ..నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నారు.? ఆయన మీడియా ముందుకు వస్తున్నారంటేనే టెన్షన్ పడుతున్నదెవరు.? ఆ నేత వైసీపీని టార్గెట్ చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందా.?
అంతా వాళ్లే చేశారు. అధినేతకు లేనిపోనివి ఎక్కించి చెప్పారు. నన్ను అవమానించారు.. తొక్కేశారు..ఫైనల్‌గా మనసు విరగ్గొట్టేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు మరోసారి సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. కాకినాడ సీపోర్ట్ వాటాల కేసుకు సంబంధించి ఇప్పటికే ఓ సారి సీఐడీ విచారణ అటెండ్ అయిన విజయసాయిరెడ్డి..ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైసీపీని ఔట్‌రైట్‌గా కార్నర్ చేశారు. జగన్ కోటరీనే ముంచేసిందన్న ఆయన సీపోర్ట్ వాటాల ఇష్యూలో తనకేం సంబంధం లేదని చెప్పుకున్నారు.
వైవీ విక్రాంత్‌రెడ్డిదే కీలక పాత్ర అని ఆరోపించారు. అంతేకాదు కేవీ రావు, వైవీ సుబ్బారెడ్డి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. పైగా లిక్కర్ స్కామ్ వెనుక రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి హస్తం ఉందని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కవర్ చేశారు. ఒక్కరోజు విచారణకు హాజరయ్యే చెప్పాల్సిదంతా చెప్పారు విజయసాయి.
Also Read : దేశంలో అత్యధిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేలు వీరే.. టాప్ 10లో మన శాసన సభ్యులు ఎంతమంది ఉన్నారంటే?
ఈసారి ఏం చెబుతారోనని వైసీపీ పెద్దల్లో టెన్షన్..
భవిష్యత్‌లో మరిన్ని విషయాలు చెబుతానంటూ అప్పుడే చెప్పేశారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు మరోసారి ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఈసారి ఆయన ఏం మాట్లాడుతారోనన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వస్తున్నారంటేనే పలువురు వైసీపీ పెద్దలకు టెన్షన్ పుడుతుందట.
వైసీపీపై విజయసాయి వార్ షురూ అయిందంటున్న టాక్ వినిపిస్తోంది. జగన్ చుట్టూ ఓ కోటరి ఉందని మొన్న సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..మళ్లీ సీఐడీ విచారణకు హాజరై ఏ మాట్లాడుతారోనన్న టెన్షన్ అయితే క్రియేట్ అవుతోంది. ఎక్స్ వేదికగా జగన్‌పై మరో బుల్లెట్ వదిలారు విజయసాయి. రాజుల కథ చెప్పి జగన్ కోటరీని ఇండైరెక్టుగా టార్గెట్ చేశారు.
కోట కూడా మిగలదంటూ జగన్ పై విమర్శలు..
కోటరీ మాటలు వింటే కొంప మునిగిపోతుందని.. రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలన్నారు. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని సూచించారు. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదంటూ జగన్‌పై పరోక్షంగా మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు విజయసాయిరెడ్డి.
కాకినాడ సీపోర్ట్ వాటాల కేసులో మొన్న సీఐడీ విచారణకు హాజరై విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. కోటరీ కామెంట్స్ వైసీపీలో కలకలం రేపాయి. ఇప్పుడు మళ్లీ ఆయనకు నోటీసులు అంటే.. ఇంకా ఏం బాంబ్ పేల్చుతారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్ను వదలా అంటూ..మీడియా ముందుకు వచ్చినా..సోషల్ మీడియా వేదికగా అయినా వైసీపీ మీద అటాక్ చేస్తున్నారు విజయసాయిరెడ్డి.
Also Read : జగన్‌కు మర్రి ఝలక్.. ఎమ్మెల్సీలు ఎందుకిలా? వీళ్ల బాటలో మరికొందరు?
అదే జరిగితే మరింత ఇరకాటంలో వైసీపీ..?
అయితే మొన్న ఆయన చేసిన కామెంట్స్ మీదే ఆచితూచి రియాక్ట్ అయింది వైసీపీ. ఆ తర్వాత ఆయన చేసిన ట్వీట్ మరింత దుమారం లేపింది. 25న విచారణకు విజయసాయి హాజరైతే మరోసారి హాట్ కామెంట్స్ చేయడం..మరిన్ని లీకులు ఇవ్వడం పక్కా అన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే వైసీపీ మరింత ఇరకాటంలో పడొచ్చన్న టాక్ వినిపిస్తోంది.
విజయసాయిరెడ్డి కామెంట్స్ తర్వాత..జనసేన ప్లీనరీలో బాలినేని శ్రీనివాస్ చేసిన కామెంట్స్ వైసీపీ శిబిరంలో చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ ఇద్దరు జగన్‌కు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. ఇప్పుడా లీడర్లు కూటమికి అస్త్రంగా మారి..వైసీపీని, జగన్‌ను టార్గెట్ చేయడంతో ఫ్యాన్ పార్టీలో డైలమా కనిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ లీడర్లు..ఆ ఇద్దరు నేతలను సరిగ్గా టార్గెట్ చేయలేకపోతున్నారు. ఈ సిచ్యువేషన్‌లో విజయసాయిరెడ్డి మరోసారి సీఐడీ విచారణకు హాజరుకానుండటం వైసీపీకి కాస్త ఇబ్బందికర అంశమే అన్న చర్చ జరుగుతోంది.
ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసే ఆరోపణలు, విమర్శలు ఒక ఎత్తు అయితే..మొన్నటి విచారణలో ఆయన సీఐడీకి ఏం చెప్పారు..నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారనేదే వైసీపీ లీడర్లను కలవరపెడుతోందట. మీడియాకే కావాల్సినంత స్టఫ్ ఇస్తున్న విజయసాయి ఇక సీఐడీకి ఏమేం చెప్పారోనన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. కాకినాడ సీపోర్ట్ వాటాల విషయంలో రెండోసారి విచారణకు హాజరైన తర్వాత విజయసాయి ఏం మాట్లాడతారో చూడాలి మరి.