Jogi Ramesh: నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ రౌండప్ అయినట్లేనా? లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమంటున్నది అందుకేనా?
కట్ చేస్తే సిట్ సడెన్ షాక్ ఇచ్చింది. జోగి రమేష్ పేరును నిందితుడిగా చేర్చడంతో లిక్కర్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.
Jogi Ramesh: అలిగేషన్స్ అయిపోయాయి. అసలు ఎపిసోడ్ స్టార్ట్ కాబోతోంది. నిందితులు విచారణలు, స్టేట్‌మెంట్లు కోర్టుకు ఇచ్చింది సిట్. వాళ్లిచ్చిన సమాచారం ఆధారంగా జోగి రమేష్‌ను నిందితుడిగా చేర్చారు దర్యాప్తు అధికారులు. ఇప్పటివరకు ఆరోపణలతో సరిపోయిన వివాదం కాస్త కోర్టు మెట్లెక్కబోతోంది. కీలక ఆధారాలు దొరికిన తర్వాతే జోగి రమేష్ పేరును చేర్చినట్లు టాక్ వినిపిస్తోంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు ఉచ్చు బిగుసుకున్నట్లేనా? లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమంటున్నది అందుకేనా? అరెస్ట్ టెన్షన్‌తోనే జోగి హడావుడి చేస్తున్నారా?
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు చెప్పడంతో..వాట్ నెక్స్ట్ అన్న చర్చ బయలుదేరింది. అయితే ఇన్నాళ్లు ఆరోపణల చుట్టే రచ్చ జరిగింది. టీడీపీ నేతల ఆరోపణలు..వాటికి కౌంటర్ ఇచ్చుకోవడానికే సరిపోయారు జోగి రమేష్. ఆయనపై ఒక్క కేసు కూడా కాకుండానే కావాల్సిన బద్నాం అయ్యారు. అది సరిపోదన్నట్లు నకిలీ లిక్కర్‌లో జోగి రమేష్‌దే కీలక పాత్ర అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్‌తో కొంత గందరగోళం నడిచింది. ఐవీఆర్ఎస్ కాల్స్‌పై డీజీపీ ఆఫీస్‌కు కూడా ఫిర్యాదు చేశారు జోగి రమేష్. దాంతో ఇక నకిలీ లిక్కర్ ఎపిసోడ్‌కు అంతటితో ఎండ్‌కార్డ్ పడ్డట్లేనన్న టాక్ వినిపించింది.
నిందితుడు జనార్ధన్ చెప్పిన విషయాలతో బిగుస్తున్న ఉచ్చు..
కట్ చేస్తే సిట్ సడెన్ షాక్ ఇచ్చింది. జోగి రమేష్ పేరును నిందితుడిగా చేర్చడంతో లిక్కర్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. అయితే జోగి రమేష్ మాత్రం తనకు జనార్ధన్ రావు తెలియదని, నకిలీ మద్యం కేసుతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. జనార్ధన్‌రావుతో జోగి రమేష్ ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కల్తీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు సిట్ విచారణలో చెప్పిన పలు విషయాలతో జోగి రమేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. జనార్ధన్ రావు స్టేట్‌మెంట్‌ను ఆడియో, వీడియో రికార్డింగ్‌తో పాటు లిఖిత పూర్వకంగా ఎక్సైజ్, సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారట.
నకిలీ మద్యం కేసులో నిందితుడిగా చేర్చడంతో జోగి రమేష్ మరోసారి రియాక్ట్ అయ్యారు. తనకు లిక్కర్ కేసుతో సంబంధం లేదని దుర్గమ్మ దగ్గర ప్రమాణం చేశానని..తాను తప్పు చేసినట్లు చంద్రబాబు, లోకేశ్ ప్రమాణం చేయాలని సవాల్ చేసినా స్పందన లేదన్నారు. సీబీఐ కాకపోతే దేశంలో ఏ సంస్థతో అయినా విచారణ జరపండి.. ఎవరో స్టేట్ మెంట్ ఇచ్చారని తనను అరెస్ట్ చేస్తే ఊరుకోనంటున్నారు జోగి రమేష్. అక్రమంగా తనను జైలుకు పంపిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని..తాను పోరాటంలో ఎక్కడా తగ్గనంటున్నారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్‌ను అరెస్ట్ టెన్షన్ వెంటాడుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
జోగి రమేష్ అరెస్ట్ ఎప్పుడు?
జోగి రమేష్ అరెస్ట్ ఎప్పుడు? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ డిబేట్‌గా మారింది. అయితే జనార్ధన్‌రావు వీడియో రిలీజ్ చేసినా జోగిపై కేసు నమోదు కాలేదు. జనార్ధన్‌రావు విడుదల చేసిన వీడియో ఒక్కటే జోగి రమేష్ అరెస్టుకు ఆధారంగా సరిపోదనే ప్రభుత్వం ఇన్నాళ్లు వెయిట్ చేసినట్లు టాక్. పూర్తి ఎవిడెన్స్ సేకరించడంతో పాటు..పకడ్బందీ ఆధారాలు దొరికాకే జోగి రమేష్‌ను నిందితుల లిస్ట్‌లో చేర్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు జోగి రమేష్ అరెస్టు కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా..అరెస్టు చేస్తారన్న ప్రచారంతోనే ఆయన్ను టెన్షన్ పెట్టింది. ఇప్పుడు ఏకంగా నిందితుడిగా చేర్చడంతో ఆయన అరెస్ట్ ఖాయమని అంటున్నారు. జోగి రమేష్ కూడా ఇదే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన మాజీమంత్రి జోగి రమేష్‌ను అన్ని రకాలుగా కార్నర్ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు. అయితే అప్పుడు రాజ్యాంగబద్దంగా తాను నిరసన తెలపడానికి వెళ్తే అది మనసులో పెట్టుకుని కక్ష సాధిస్తారా అంటూ జోగి రమేష్ ప్రశ్నిస్తున్నారు. ఇక జోగి రమేష్ అయితే మానసికంగా అరెస్టుకు సిద్ధమయ్యారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రమాణాలు..మీడియా సమావేశాలు అంటూ హడావుడి చేస్తున్నారని అంటున్నారు. ఈ ఆరోపణల నుంచి తాను బయటపడటమే కాదు..పార్టీని కూడా సేవ్ చేసే పనిలో ఉన్నారట.
అయితే తంబళ్లపల్లి నకిలీ మద్యం కేసులో ఉన్నా జయచంద్రారెడ్డి టీడీపీ నేత అయినప్పటికీ..ఆయనకు వైసీపీ సీనియర్ లీడర్ మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సన్నిహిత సంబధాలున్నాయని..గతంలో పెద్దిరెడ్డి దగ్గర సబ్ కాంట్రాక్టులు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. నకిలీ మద్యం కేసు బయటికి వచ్చినప్పుడు కూడా జయచంద్రారెడ్డి లింకులను బయటికి తీస్తే వైసీపీ లీడర్లు బుక్కవడం ఖాయమని టీడీపీ భావించింది. ఈ క్రమంలోనే సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ ప్రధాన నిందితుడు జనార్ధన్‌రావే ఓ వీడియోను రిలీజ్ చేస్తూ జోగి రమేష్ ప్లాన్‌ను వివరించడం హాట్ టాపిక్ అయింది.
జనార్ధన్‌రావు లిక్కర్ లింకులను బయటపెట్టడంతో..వైసీపీ డిఫెన్స్‌లో పడ్డట్లు అయింది. సిట్ విచారణలో ఏం తేలుతుందో..ఈ కేసు కోర్టుల్లో నిలబడుతుందో లేదో తెలియదు కానీ..ఇప్పుడైతే జరగాల్సిన రాద్దాంతం అంతా జరుగుతోంది. అటు ఇటు తిరిగి వైసీపీ వైపు మళ్లింది నకిలీ లిక్కర్ ఇష్యూ. పోటాపోటీ ఆరోపణలు..వివరణలతో బ్లేమ్ గేమ్ అయిపోయింది. ఇక జోగి రమేష్ అరెస్ట్ అయితే లీగల్ ఫైట్ స్టార్ట్ కానుంది. నకిలీ లిక్కర్ గేమ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
Also Read: ఓవైపు రివ్యూలు..ఇంకోవైపు ఫీల్డ్ విజిట్లు.. వైసీపీ విమర్శలకు పవన్ చెక్ చెప్పినట్లేనా?
