Gossip Garage : సంబరాలు కాదు నిరసనలు.. పార్టీ ఆవిర్భావం రోజునే వైసీపీ పోరుబాట ఎందుకు? జగన్ వ్యూహమేంటి?

దారుణ ఓటమి తర్వాత వచ్చిన వైసీపీ తొలి ఆవిర్భావ దినోత్సవం రోజు నిరసనలకే పరిమితం అవడం మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Gossip Garage : సంబరాలు కాదు నిరసనలు.. పార్టీ ఆవిర్భావం రోజునే వైసీపీ పోరుబాట ఎందుకు? జగన్ వ్యూహమేంటి?

Updated On : March 11, 2025 / 10:59 PM IST

Gossip Garage : పార్టీ పుట్టి 15 ఏళ్లు అవుతుంది. ఈ కాలంలో ఫ్యాన్‌ పార్టీ ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది. అయితే ఈసారి పార్టీ ఆవిర్భావం రోజు మాత్రం వేడుకలు కాకుండా నిరసనలకు ప్రాధాన్యం ఇస్తోంది. అపోజిషన్‌లో ఉన్న వైసీపీ మార్చి 12న పెద్దఎత్తున ప్రొటెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. అసలు పార్టీ ఆవిర్భావం రోజు సంబరాలు కాకుండా.. నిరసనలకు ఎందుకు ప్రయారిటీ ఇస్తోంది.? క్యాడర్, లీడర్లలో జోష్‌ నింపేందుకు అధినేత చేస్తున్న ప్రయత్నాలేంటి.?

మార్చి 12. వైసీపీ పార్టీ చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు. సరిగ్గా 14 ఏళ్ల కింద 2011 మార్చి 12న వైసీపీ పార్టీని స్థాపించారు వైఎస్‌ జగన్. కాంగ్రెస్‌ను విభేధించి బయటికి వచ్చిన జగన్‌ పార్టీ పెట్టి 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. అయితే గతంలో ఎప్పుడూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వచ్చినా ఓ రేంజ్‌లో హడావుడి ఉండేది. అధ్యక్షుడి నుంచి గ్రామ స్థాయి వరకు జెండా ఆవిష్కరణలతో హోరెత్తించే వారు వైసీపీ లీడర్లు. కానీ ఈసారి సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ అన్నట్లుగా పార్టీ ఆవిర్భావం రోజు ప్రభుత్వ తీరుపై నిరసనలకు పిలుపునిచ్చింది ఫ్యాన్ పార్టీ అధిష్టానం.

Also Read : అరెస్ట్ తప్పదా? విజయసాయి రెడ్డికి సీఐడీ, ఆర్కే రోజాకు ఏసీబీ సెగ.. నెక్స్ట్ టార్గెట్ ఎవరు?

సంబరాల కంటే కూటమి సర్కార్‌పై పోరు మీదే కాన్సంట్రేట్‌..
విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదని.. యువతకు నిరుద్యోగ భృతి అందడం లేదని, ఉద్యోగాల కల్పనలో మోసం జరిగిందంటూ యువత పోరు పేరుతో ఈ నెల 12న వైసీపీ భారీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. అయితే పార్టీ ఆవిర్భావం రోజు వైసీపీ నిరసనలకు పిలుపునివ్వడం మాత్రం ఆసక్తికరంగా మారింది. పార్టీ సంబరాల కంటే కూటమి సర్కార్‌పై పోరు మీదే కాన్సంట్రేట్‌ చేయడం చర్చనీయాంశం అవుతోంది.

పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం..
వైసీపీ అపోజిషన్‌లో ఉండటం..నేతల వరుస అరెస్టులతో లీడర్లు, క్యాడర్లలో కాస్త డైలమాలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే పలుసార్లు నిరసనలు తెలిపినా..పార్టీ ఆవిర్భావం రోజైన మార్చి 12న ప్రొటెస్ట్‌కు పిలుపునివ్వడం మాత్రం కొత్త స్ట్రాటజీగా చెబుతున్నారు వైసీపీ నేతలు. ఓవైపు పార్టీ ఆవిర్భావ వేడుకలు.. ఇంకోవైపు కూటమి సర్కార్ తీరుపై నిరసన గళంతో పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారట జగన్.

గత ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ కాస్త డీలా పడిపోయింది. పార్టీ అధ్యక్షుడు అయిన జగన్ సహా కీలక నేతలంతా కొన్ని నెలల పాటు డైలమాలో పడిపోయారన్న టాక్ వినిపించింది. ఇప్పుడిప్పుడే బౌన్స్‌ బ్యాక్ అవుతూ కూటమి సర్కార్‌ విధానాలపై కాస్త స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నప్పటికీ..నేతల వరుస అరెస్టులు ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయట. దీంతో వైసీపీ మళ్ళీ జనంలోకి వెళ్లాలన్నా..క్యాడర్‌కు నైతిక స్థైర్యం ఇవ్వాలన్నా పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారట.

ముందు పార్టీ బాగుంటే ఆ తర్వాత ప్రజల మద్దతు కూడగట్టొచ్చని స్కెచ్ వేస్తున్నారట. క్యాడర్‌ను తిరిగి పార్టీ వైపు అట్రాక్ట్ చేసి ఉత్తేజం నింపే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ ఆవిర్భావం రోజైన మార్చి 12న నిరసనలకు పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు.

Also Read : అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? బడ్జెట్ సెషన్స్‌పై గులాబీ బాస్ వ్యూహమేంటి?

దారుణ ఓటమి తర్వాత వచ్చిన వైసీపీ తొలి ఆవిర్భావ దినోత్సవం రోజు నిరసనలకే పరిమితం అవడం మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ నిరసనలతో కూటమి ప్రభుత్వాన్ని కదిలించాలని ప్లాన్ చేస్తోందట వైసీపీ. ఇక నుంచి వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేలా ప్రణాళిక రెడీ చేశారట. స్ట్రాటజీ ప్రకారమే ఈ సారి పార్టీ ఆవిర్భావ వేడుకలకు గ్రాండ్‌గా నిర్వహించడం లేదంటున్నారు.

మరో ఒకటి రెండేళ్లు ఆగి ఎన్నికలకు ముందు పెద్దఎత్తున సభ్యత్వ నమోదు నిర్వహించి..పార్టీ ఆవిర్భావ వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయడం ద్వారా క్యాడర్, లీడర్లతో జోష్‌ నింపే స్కెచ్ వేస్తోందట వైసీపీ. ఫ్యాన్ పార్టీ అధినేత వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయనేది చూడాలి.