Gossip Garage : అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? బడ్జెట్ సెషన్స్‌పై గులాబీ బాస్ వ్యూహమేంటి?

ఒకవేళ కేసీఆర్ సభకు హాజరు కావొద్దనుకుంటే మాత్రం.. బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా మరో నేతను పెడతారని అంటున్నారు. కేటీఆర్, హరీశ్‌రావులలో ఒకరికి బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా అవకాశం కల్పిస్తారనే టాక్ వినిపిస్తోంది.

Gossip Garage : అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? బడ్జెట్ సెషన్స్‌పై గులాబీ బాస్ వ్యూహమేంటి?

Updated On : March 12, 2025 / 11:42 AM IST

Gossip Garage : సార్‌ వ్యూహాత్మక మౌనం వీడారు. అసెంబ్లీకి వస్తానని చెప్తున్నారు. పార్టీ ఎల్పీ మీటింగ్‌ కూడా నిర్వహించారు. అయినా గులాబీ దళపతి శాసనసభ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న డైలమా కొనసాగుతూనే ఉంది. గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ సభకు వస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నా.. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కేసీఆర్‌ స్థాయిని తగ్గించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరే అందుకు కారణమంటున్నారు గులాబీ నేతలు. ఇంతకీ అసెంబ్లీ సెషన్స్‌పై కేసీఆర్ వ్యూహమేంటి.?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అంతా సిద్ధమైంది. ఈసారి శాసనసభా సమావేశాలు హాట్‌హాట్‌గా సాగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతోంది. కేసీఆర్ సభకు వస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నప్పటికీ.. సమావేశాల అయిపోయే వరకు అసెంబ్లీకి అటెండ్ అవుతారా లేదా అన్న డైలమా కొనసాగుతోంది.

గత అసెంబ్లీ సమావేశాల సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకముందే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన గులాబీ బాస్..అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ఆ తర్వాత అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొనలేదు. అంతేకాదు ఆ తర్వాత అసెంబ్లీ వైపు రాలేదు కేసీఆర్.

Also Read : తెలంగాణలో అధిక ఆదాయం రావటానికి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం- సీఎం చంద్రబాబు

ఈసారి ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే కేవలం గవర్నర్ ప్రసంగం వరకే పరిమితం అవుతారా..లేదా మొత్తం అసెంబ్లీ సెషన్‌కు అటెండ్ అవుతారా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు. మరోవైపు కేసీఆర్ సభకు వస్తే ఆయనను టార్గెట్ చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పదేళ్ళ పాలనను అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టేందుకు హస్తం పార్టీ సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ తన పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మరింత కార్నర్ చేయాలని ప్లాన్ చేస్తోందని టాక్.

కేసీఆర్‌ను అవమానించేలా వ్యవహరించే అవకాశం?
బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను తక్కువ చేసి మాట్లాడే ఛాన్స్ ఉందని, కేసీఆర్‌ను అవమానించేలా వ్యవహరించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఇదే జరిగిందని అంటున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏ స్థాయిలో అటాక్‌ వచ్చినా..సభలో కేటీఆర్‌, హరీశ్‌రావు ఎదుర్కొంటున్నారు. సభా నాయకుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు తక్కువేనని అంటున్నారు.

మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పాలని అధికార పార్టీ వైపు నుంచి పట్టుబడుతున్నా..బాస్‌ అవసరం లేదంటూ తామే స్పందిస్తున్నారు కేటీఆర్, హరీశ్. అయితే ఈసారి అసెంబ్లీ సెషన్‌ మొత్తం కేసీఆర్ హాజరవుతారా..లేక అవసరం మేరకే సభకు వస్తారా అన్నది ఇప్పుడే చెప్పలేమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారు. దీంతో పాత స్ట్రాటజీ ప్రకారమే బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు మాత్రమే కేసీఆర్‌ సభకు హాజరవుతారన్న టాక్ వినిపిస్తోంది.

Also Read : గ్రూప్ 2 ఫలితాలు విడుదల.. ర్యాంకులు ఇలా చెక్ చేసుకోండి..

బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా మరో నేత?
ఒకవేళ కేసీఆర్ సభకు హాజరు కావొద్దనుకుంటే మాత్రం.. బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా మరో నేతను పెడతారని అంటున్నారు. కేటీఆర్, హరీశ్‌రావులలో ఒకరికి బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా అవకాశం కల్పిస్తారనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ కుటుంబం నుంచి కాకుండా ఇతరులకు అవకాశం ఇవ్వాలనుకుంటే బీసీ నేత గంగుల కమలాకర్ గానీ.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గానీ బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నుకుని ముందుకెళ్లే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇదంతా బయట జరుగుతున్న ప్రచారమే అయినా రాబోయే రోజుల్లో ఎలాంటి డెవలప్‌మెంట్స్ ఉండబోతున్నాయో చూడాలి.