Ysrcp: రాజధానిపై వైసీపీ లీడర్ల మల్టీపుల్ వెర్షన్స్..! ఎందుకీ డైలమా.. కన్ఫ్యూజనా? స్ట్రాటజీనా?
2014లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..అసెంబ్లీలో ఏపీ రాజధానిగా అమరావతి అని చర్చకు వచ్చినప్పుడు ఫ్యాన్ పార్టీ కూడా రైట్ రైట్ అనేసింది. ఆ తర్వాత 2019లో అధికారంలో వచ్చాక మూడు రాజధానులు అన్న నినాదం ఎత్తుకుంది.
- జగన్ నోట మావిగన్ మాట..క్యాపిటల్ ఫైట్‌లో ట్విస్ట్
- మావిగన్ ప్రతిపాదనలో తప్పేం లేదంటున్న బొత్స
- అమరావతి పేరుతో ఒకే చోట అభివృద్ధి చేస్తున్నారన్న ధర్మాన
Ysrcp: అమరావతికి ముందు ఓకే అన్నారు. ఆ తర్వాత మూడు రాజధానుల స్లోగన్ అందుకున్నారు. అది వర్కౌట్ కాలేదు. అంతటితో ఇష్యూ క్లోజ్ అయిందనుకుంటే.. మావిగన్ అంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఉత్తరాంధ్ర వైసీపీ నేతల వాదన అయితే ఇంకా డిఫరెంట్. అమరావతి పేరుతో ఒకే దగ్గర అభివృద్ధి చేస్తే ఎలా అని ధర్మాన..అమరావతికి వ్యతిరేకం కాదంటూనే..మావిగన్ ప్రతిపాదనలో తప్పేం లేదంటూ కవర్ డ్రైవ్ స్టార్ట్ చేశారు బొత్స. క్యాపిటల్ విషయంలో వైసీపీ కన్ఫ్యూజన్లో ఉందా? జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుందా? ఎందుకీ డైలమా?
అధినేత నుంచి..పార్టీలో సీనియర్ లీడర్ వరకు ఒక్కొక్కరిది ఒక మాట. ఎవరి మాటల్లో క్లారిటీ లేదు. అంతా కన్ఫ్యూజన్. గజిబిజి గందరగోళం. అమరావతికి వ్యతిరేకం కాదంటారు. జగన్ సూచించిన మావిగన్ ప్రతిపాదనలో తప్పేం లేదంటారు. జగనేమో ప్లాన్-A త్రీ క్యాపిటల్స్..ప్లాన్-బి మావిగన్ అంటారు. అమరావతి పేరుతో ఒకేచోట అభివృద్ధి చేస్తే ఎలా అని ప్రశ్నిస్తారు. ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటంటూ నిలదీస్తారు. దీంతో ఒక ప్రధాన రాజకీయ పార్టీగా వైసీపీ..ఏపీ రాజధాని విషయంలో స్పష్టంగా ఉండలేకపోతోందా అన్న చర్చ సాగుతోంది.
వైసీపీలో ఉన్న అన్ని ప్రాంతాల నాయకులు రాజధానిపై ఒకే మాట మీద ఉంటున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధినాయకుడు జగన్ ఈ నెల 1న ప్రెస్ మీట్ పెట్టి మరీ మావిగాన్ అని ఒక కొత్త ప్రతిపాదన చేశారు. దాని మీద వైసీపీలోనే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయా అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
మూడు రాజధానుల స్థానంలో మావిగన్..
2014లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..అసెంబ్లీలో ఏపీ రాజధానిగా అమరావతి అని చర్చకు వచ్చినప్పుడు ఫ్యాన్ పార్టీ కూడా రైట్ రైట్ అనేసింది. ఆ తర్వాత 2019లో అధికారంలో వచ్చాక మూడు రాజధానులు అన్న నినాదం ఎత్తుకుంది. ఆ సమయంలో విశాఖలో పరిపాలనా రాజధాని పెడతామని చెప్పుకొచ్చింది. దాంతో ఉత్తరాంధ్ర వైసీపీ నేతల ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకునే వారు. వెనకబడిన ఉత్తరాంధ్రకు రాజధానిని తీసుకుని వస్తున్నామని కూడా భారీ ప్రకటనలు ఇస్తుండే వారు. అయితే ఐదేళ్ల వైసీపీ పాలనలో విశాఖ నుంచి కీలక అడుగు పడింది లేదు. పైగా పరిపాలనా రాజధాని అన్నది పబ్లిక్కు అర్థమయ్యే నాటికి వైసీపీ ప్రభుత్వం దిగిపోయింది. మూడు రాజధానులు కూడా అటకెక్కాయని లేటెస్ట్గా జగన్ ఇచ్చిన మావిగన్ స్టేట్మెంట్తో తేలిపోయిందంటున్నారు కూటమి నేతలు.
చంద్రబాబు అమరావతి పేరుతో అభివృద్ధి అంతా ఒకే చోట పెడుతున్నారని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శలు చేయడం ఇంకా ఇంట్రెస్టింగ్గా మారింది. అలా అయితే ఏపీలో ఇతర ప్రాంతాల అభివృద్ధి ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాల గురించి పట్టదా అని నిలదీశారు. అయితే జగన్ కూడా గుంటూరు, విజయవాడ మావిగన్ అంటూ క్యాపిటల్‌ను ప్రస్తావించారు. ఈ లెక్కన మావిగన్ ప్రతిపాదన రాజధాని కూడా గుంటూరు, విజయవాడ మధ్య అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కానుంది. దీంతో వైసీపీ నేతలు చెబుతున్న దానికి చేస్తున్న విమర్శలకు మావిగన్ ప్రపోజల్ కూడా టైంపాస్ ముచ్చటే అన్న టాక్ నడుస్తోంది.
ఇక బొత్స సత్యనారాయణ లాంటి ఉత్తరాంధ్ర నేతలు అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని అంటున్నారు. సేమ్‌టైమ్ జగన్ మావిగన్ ప్రతిపాదనలో తప్పేంటి అని సమర్థించుకుంటున్నారు. ఇక పక్క పక్క జిల్లాల్లో ఉన్న బొత్స కానీ ధర్మాన కానీ ఏపీ రాజధాని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వన్ లైన్ ఎజెండాతో ఉన్నారా అన్న చర్చ కూడా వస్తోంది. అమరావతికి బొత్స ఓకే అంటుంటే ధర్మాన వేరేలా మాట్లాడుతున్నారు. అధినాయకత్వం మావిగన్ అంటోంది. ఇలా తలో రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తుండటంతో..వైసీపీ తాను గందరగోళంలో చిక్కుకుని జనాలను కూడా కన్ఫ్యూజ్ చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది.
వైసీపీ డైలమాలో ఉండి..జనాలను కన్ఫ్యూజ్ చేస్తోందా?
వైసీపీ నేతల డిఫరెంట్ టోన్‌కు కూటమి నేతల నుంచి ధీటుగానే ప్రతి విమర్శలు వస్తున్నాయి. విశాఖ రాజధాని ఏమైందో చెప్పాలని వారు కౌంటర్లు వేస్తున్నారు. మావిగన్ ప్రతిపాదన ధర్మానకు నచ్చిందా లేదా కూడా చెప్పాలని కోరుతున్నారు. మరోవైపు ఏపీ రాజధాని విషయంలో వైసీపీ నేతల మధ్య, ప్రాంతాల వారీగా ఆ పార్టీ లీడర్ల మధ్య ఒక ఏకాభిప్రాయం ఉందా లేదా అన్న డౌట్స్‌ను వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ తీరు ఇలాగే ఉంటే రాజధాని ఇష్యూనే గుదిబండగా మారి..రాబోయే రోజుల్లో పొలిటికల్‌గా అతిపెద్ద సవాల్‌గా మారే ప్రమాదం ఉందంటున్నారు.
