Fight For Water : ఖైదీ నెం.150 సినిమా తరహాలో.. నీటి కోసం గ్రామస్తుల పోరాటం

గత వారం రోజులుగా గుడిమెట్ల పంచాయతీలో నీటి సరఫరా లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యను పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Fight For Water : ఖైదీ నెం.150 సినిమా తరహాలో.. నీటి కోసం గ్రామస్తుల పోరాటం

Gudimetla Villagers

Updated On : August 4, 2023 / 11:34 PM IST

Gudimetla Villagers Fight For Water : ఎన్టీఆర్ జిల్లాలో నీటి కోసం గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఖైదీ నెం.150 సినిమా తరహాలో నీటి కోసం గుడిమెట్ల గ్రామస్తులు పోరాటం చేశారు. తమ గ్రామానికి నీరు లేకుండా ఏ గ్రామానికి నీళ్ళు ఇచ్చేది లేదని గ్రామస్తులు ఏకంగా ఆర్ డబ్ల్యూఎస్ స్కీంనే నిలిపి వేశారు. తమ గ్రామానికి నీరు లేకుండా మిగిలిన గ్రామాలకు నీరు ఎలా సరఫరా చేస్తారని గుడిమెట్ల గ్రామస్తులు ఆర్ డబ్ల్యూఎస్ మంచినీటి స్కీం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు.

గత వారం రోజులుగా గుడిమెట్ల పంచాయతీలో నీటి సరఫరా లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యను పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులు ఆర్ డబ్ల్యూఎస్ స్కీంను నిలుపుదల చేశారు.

Badvel : బద్వేల్ లో విద్యుత్ ఉద్యోగులు నిరసన.. విద్యుత్ లేక అలుముకున్న చీకట్లు, ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు

తమకు నీరు ఇచ్చి మిగిలిన గ్రామాలకు పంపాలని డిమాండ్ చేస్తూ ఆర్ డబ్ల్యూఎస్ స్కీంను నిలిపి వేశారు. అధికారులకు ఫోన్ చేసినా కనీసం ఫోన్ ఎత్తకపోవడంతో గ్రామస్తులు ఆర్ డబ్ల్యూఎస్ స్కీంను నిలుపుదల చేసి నిరసన తెలిపారు.