CORONAVIRUS : ఏపీలో తెరుచుకొనేవి ఇవే..మార్గదర్శకాలు జారీ

ఏపీ రాష్ట్రంలో కరోనా విస్తరిస్తూనే ఉంది. రోజు రోజకు పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఏపీకి తీరని నష్టం కలుగుతోంది. లాక్ డౌన్ ను మరోసారి కేంద్రం పొడిగించింది. మే 03వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో పాటు..కొన్నింటికి మాత్రం అనుమతినిచ్చింది.
2020, ఏప్రిల్ 20వ తేదీ సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆదివారం లాక్ డౌన్ మినహాయింపు మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అత్యవసర వస్తు ఉత్పత్తి పరిశ్రమలకు పరిమితికి మినహాయింపులు ఇచ్చింది. కేంద్ర హోం శాఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలకు అనుగుణంగా మినహాయింపులు ఇచ్చింది. లాక్ డౌన్ ఆంక్షలను పరిశ్రమల కోసం సడలిస్తూ..ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు పనిచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రైస్, పప్పు, మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తులకు లాక్ డౌన్ నుంచి మినహాయించారు.
ఆర్వో ప్లాంట్లు, ఆహార ఉత్పత్తి పరిశ్రమలు, ఔషధ తయారీ సంస్థలకు ఓపెన్ చేసుకోవచ్చని వెల్లడించింది.
సబ్బుల తయారీ కంపెనీలు, మాస్క్ లు, బాడీ సూట్ ల తయారీ సంస్థలు.
శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల పరిశ్రమలు.
ఐస్ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఈ కామర్స్ సంస్థలు.
ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతుల యూనిట్లకు లాక్ డౌన్ నుంచి మినహాంపుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.