బాలింతను భుజంపై ఎత్తుకుని పెద్దేరువాగు దాటించిన ఘటన.. అక్కడ రోప్ వే బ్రిడ్జి ఏర్పాటుకు సర్కారు నిర్ణయం
బాలింతను అలాగే మోస్తూ పెద్దేరువాగు దాటించారు. దీనిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు.

Gummadi Sandhya Rani: అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో ఓ బాలింతను కుటుంబం సభ్యులు ప్రమాదకర పరిస్థితుల్లో భుజంపై మోసుకెళ్లిన ఘటన అందరినీ కలిచి వేసిన విషయం తెలిసిందే.
బాలింతను అలాగే మోస్తూ పెద్దేరువాగు దాటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో సంధ్యారాణి మాట్లాడారు. వాగు దాటేందుకు బాలింతలు పడుతున్న కష్టాలను చూసి సంధ్యారాణి చలించిపోయారు.
బాలింతలు వాగు దాటేందుకు రోప్ వే బ్రిడ్జిని ఏర్పాటు చేసేందుకు ఆమె అనుమతులు మంజూరు చేయించారు. రూ.70 లక్షలతో దాన్ని ఏర్పాటు చేయొచ్చని అధికారులు అంచనా వేశారు. వర్షాలు తగ్గాక త్వరలో రోప్ వే బ్రిడ్జి పనులు ప్రారంభమవుతాయి.
ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు నుంచి ప్రయాణించిన బాలింత..
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో ఘటన..
పసిబిడ్డకు ట్రీట్మెంట్ అందించడం కోసం హాస్పిటల్కు వెళ్లడానికి ప్రవహిస్తున్న వాగును దాటుకుంటూ బాలింతను ఎత్తుకొని వెళ్లిన బంధువులు..
సోషల్ మీడియాలో వైరల్… pic.twitter.com/bLv18Or9gL
— Telangana Awaaz (@telanganaawaaz) September 27, 2024