B.Tech Student Murder : హత్యకు ముందు 8 నిమిషాలు రమ్యతో మాట్లాడిన నిందితుడు

బీటెక్ విద్యార్థిని రమ్య హంతకుడి కోసం గుంటూరు పోలీసులు వేట ప్రారంభించారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కొన్ని కీలక ఆధారాలు సేకరించారు.

B.Tech Student Murder : హత్యకు ముందు 8 నిమిషాలు రమ్యతో మాట్లాడిన నిందితుడు

Murder

Updated On : August 15, 2021 / 6:11 PM IST

Police collected key evidences : బీటెక్ విద్యార్థిని రమ్య హంతకుడి కోసం గుంటూరు పోలీసులు వేట ప్రారంభించారు. నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. రమ్య సన్నిహితుడే ఆమెను హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. రమ్యను హత్య చేసింది శశికృష్ణగా అనుమానిస్తున్నారు. హత్యకు ముందు నిందితుడు బైక్ పై వచ్చి ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లుగా భావిస్తున్నారు.

హత్యకు ముందు రమ్య, నిందితుడు 8 నిమిషాలు మాట్లాడుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపారు. గొడవ జరిగిన కొద్ది సేపటికే రమ్యపై నిందితుడు కత్తితో దాడి చేసినట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.

అయితే హత్య జరిగిన సమయంలో ఉన్న రమ్య సోదరి మౌనిక నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఇద్దరు కలిసి ఎప్పుడు వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? ఎవరెవరికి ఫోన్ చేశారు? అక్కడికి వచ్చాక ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించి, నిందితున్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మృతురాలి సెల్ ఫోన్ ను అన్ లాక్ చేసేందుకు సైబర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. నగరంలోని కాకాణి రోడ్డులో రమ్యను ఓ యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థిని నల్లపు రమ్య బీటెక్ ఓ ప్రయివేట్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది.

హత్య విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.