సీఎం పెళ్లి ఫోటో వైరల్: అన్నయ్య, వదినమ్మలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

  • Published By: vamsi ,Published On : August 28, 2019 / 04:58 AM IST
సీఎం పెళ్లి ఫోటో వైరల్: అన్నయ్య, వదినమ్మలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

Updated On : August 28, 2019 / 4:58 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెళ్లి రోజు ఈ రోజు(ఆగస్ట్ 28). ఈ సంధర్భంగా.. వైఎస్ జగన్.. ఆయన భార్య భారతీలకు వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ శర్మిల కూడా ఫేస్ బుక్ వేదికగా అన్నా వదినల పెళ్లి రోజు ఫోటోను పోస్ట్ చేస్తూ.. ఇరువురికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల సోషల్ మీడియాలో షేర్ చేసిన జగన్ పెళ్లి ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జగన్ సోదరి వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఫేస్‌బుక్‌లో జగన్-భారతి పెళ్లినాటి ఫోటోను షేర్ చేసిన షర్మిల.. ‘అన్నయ్య, వదినమ్మలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

1996లో ఆగస్ట్ 28వ తేదీప కడప జిల్లా పులివెందులలోని లయోలా డిగ్రీ కాలేజీ మైదానంలో జగన్-భారతిల పెళ్లి వేడుక జరిగింది. జగన్ సీఎం అయ్యాక వచ్చిన మొదటి పెళ్లిరోజు కావడంతో అభిమానులు, కార్యకర్తల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.