Visakhapatnam : టీకా వేసేందుకు కొండలు, కోనలు దాటి వెళ్లారు

విశాఖ జిల్లా రుడూకోట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో టీకా ఇస్తున్నారు వైద్య సిబ్బంది.

Visakhapatnam : టీకా వేసేందుకు కొండలు, కోనలు దాటి వెళ్లారు

Visakhapatnam

Updated On : August 20, 2021 / 1:38 PM IST

Visakhapatnam : కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో టీకా వేసేందుకు ఆరోగ్య సిబ్బంది గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు. కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ టీకా ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కరోనాపై అవగాహన బాగానే ఉంది. కొండప్రాంతాల్లో నివసించే వారికి పెద్దగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలోనే వారికి అవగాహన కల్పించేందు వైద్యసిబ్బంది కృషి చేస్తున్నారు.

ఇక కరోనా టీకా ఇచ్చేందుకు వైద్య సిబ్బంది కొండలు కోనలు దాటి వెళ్తున్నారు. గత నెలలో హిమాచల్ ప్రదేశ్ లో ప్రవహిస్తున్న నదిలోంచి వెళ్లి తమ టీకా వేశారు వైద్య సిబ్బంది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో టీకాలు వేసేందుకు ఆరోగ్య సిబ్బంది కొండలు, కోనలు, వాగులు దాటుకుంటూ వెళ్తున్నారు. విశాఖజిల్లా రూడకోట మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు వైద్య సిబ్బంది పెద్ద సాహసమే చేశారు.

పెద్ద కొండలు ఎక్కుతూ దిగుతూ ఏజెన్సీ ప్రాంతానికి చేరి వ్యాక్సిన్ ఇచ్చారు. ఆరోగ్య కార్యకర్తలు ధైర్యాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. ఎత్తుగా ఉండే కొండలను ఎక్కి దిగడం అనే సాధారణ విషయం కాదు. చేతిలో వ్యాక్సిన్ ను మోసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వెళ్లి అక్కడ ఉన్న ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చి.. తిరిగి అదే మార్గంలో ఇంటికి వచ్చారు.