Chandrababu Bail : చంద్రబాబుకి ఊరట దక్కేనా? సోమవారం ఏం జరగనుంది? బెయిల్ పిటిషన్లపై కీలక విచారణ

తనను చంపేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారన్న చంద్రబాబు.. ఈ కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిందన్నారు. Chandrababu Bail Petitions

Chandrababu Bail : చంద్రబాబుకి ఊరట దక్కేనా? సోమవారం ఏం జరగనుంది? బెయిల్ పిటిషన్లపై కీలక విచారణ

Chandrababu Bail Petitions

Updated On : October 28, 2023 / 6:55 PM IST

Chandrababu Bail Petitions : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఈ పిటీషన్లపై హైకోర్టు వెకేషన్ బెంచ్ లో విచారణ జరగాల్సి ఉండగా.. న్యాయమూర్తి ఈ కేసు విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో విచారణ వాయిదా పడింది. దీంతో సోమవారం రెగులర్ బెంచ్ పై ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇక సీఐడీ కాల్ డేటా రికార్డుపై ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును ఈ నెల 31కి రిజర్వ్ చేసింది. మరోవైపు జైల్లో తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు రాసిన లేఖ ఏసీబీ కోర్టుకి చేరింది.

నాట్ బిఫోర్ మీ..
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తో పాటు మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలిగారు. శుక్రవారం ఈ పిటిషన్ వెకేషన్ బెంచ్ ముందు విచారణకు రాగా, నాట్ బిఫోర్ మీ అంటూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో మరో జడ్జితో విచారణ జరిపించాలని చంద్రబాబు తరపు లాయర్లు కోరగా.. జస్టిస్ జ్యోతిర్మయి ఈ కేసుని సీజేకు సిఫార్సు చేశారు. అయితే, సీజే నిర్ణయం మేరకు సోమవారం రెగులర్ బెంచ్ పైనే విచారణ జరగనుంది.

Also Read : నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి- మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

సీఐడీ కాల్ డేటా రికార్డ్.. తీర్పు రిజర్వ్
ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ కాల్ డేటా రికార్డు పిటిషన్ పై వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఈ కాల్ డేటా కీలకం అని ఆయన తరపు లాయర్లు వాదించారు. ఈ కాల్ డేటా ఇవ్వడం వల్ల అధికారుల వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది లేదన్నారు. అయితే, ఈ విషయంలో పోలీసుల ఫోన్ నెంబర్లు, వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదని సీఐడీ వాదించింది. దాని వల్ల దర్యాఫ్తు అధికారులకు వ్యక్తిగతంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్న సీఐడీ లాయర్లు కాల్ డేటా రికార్డ్ పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 31కి తీర్పుని రిజర్వ్ చేసింది.

తన హత్యకు కుట్ర జరుగుతోందన్న చంద్రబాబు..
ఇక జైల్లో తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు రాసిన లేఖ ఏసీబీ కోర్టు జడ్జికి చేరింది. తనను చంపేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారన్న చంద్రబాబు.. ఈ కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిందన్నారు. తనను హత్య చేసేందుకు కోట్లు చేతులు మారినట్లు లేఖలో ఉందన్న చంద్రబాబు.. దానిపై ఇప్పటివరకు విచారణ జరపలేదని పేర్కొన్నారు. జైల్లో ఓ నిందితుడు పెన్ కెమెరాతో తిరుగుతూ ఫోటోలు తీస్తున్నాడని, తన కదలికలు తెలుసుకునేందుకు డ్రోన్ సైతం వినియోగిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.

Also Read : జైల్లో వ్యక్తులను జగన్ అండ్ టీం సైలెంటుగా చంపేస్తారు.. చంద్రబాబు భద్రతపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

జైల్లో చంద్రబాబు భద్రతపై ఆందోళన..
రాజమండ్రి జైల్లో చంద్రబాబు భద్రతపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని చంద్రబాబు రాసిన లేఖపై భువనేశ్వరి, బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాసిన లేఖ తీవ్రంగా కలిచి వేస్తోందని ట్వీట్ చేసిన భువనేశ్వరి.. జైల్లో పరిస్థితులపై తాము మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబును హైకోర్టులో హాజరుపరచాలంటూ కోసరాజు వెంకట కృష్ణారావు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ జరిగిందని పబ్లిక్ ఇంట్రస్ట్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీన్ని తిరస్కరించిన హైకోర్టు రెగులర్ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించింది.