Daggubati Purandeswari : ఏపీ భారీగా అవినీతి, శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు- సీఎం జగన్‌పై పురంధేశ్వరి ఫైర్

గతంలో ఉన్న బ్రాండ్లను తీసేసి తమ అనుచరులు తయారు చేస్తున్న మద్యం బ్రాండ్లను జనం నెత్తిన రుద్దుతున్నారని ఆరోపించారు. Daggubati Purandeswari - CM Jagan

Daggubati Purandeswari : ఏపీ భారీగా అవినీతి, శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు- సీఎం జగన్‌పై పురంధేశ్వరి ఫైర్

Daggubati Purandeswari - CM Jagan

Updated On : September 18, 2023 / 5:48 PM IST

Daggubati Purandeswari – CM Jagan : ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. వైసీపీ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఈ అవినీతికి కర్త, కర్మ, క్రియ అధికార పార్టీయే అని ఆమె ధ్వజమెత్తారు.

మద్య నిషేధం ఏమైంది?
ఏపీలో దశల వారీ మద్య నిషేధం ఏమైందని ప్రశ్నించారు పురంధేశ్వరి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ చెప్పినదానికి అధికారంలోకి వచ్చాక ఆచరిస్తున్న దానికి సంబంధం లేదన్నారు. గతంలో ఉన్న బ్రాండ్లను తీసేసి తమ అనుచరులు తయారు చేస్తున్న మద్యం బ్రాండ్లను జనం నెత్తిన రుద్దుతున్నారని ఆరోపించారు. 2019లో మద్యంపై ఉన్న ఆదాయం ఎంత? ఇప్పుడు ఎంత? దీనికి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పురంధేశ్వరి.

Also Read..Brahmani Nara : చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి..? పార్టీ కష్టాల్లో ఉండటంతో బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధం

వాళ్లంతా జగన్ అనుచరులే..
”వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబిల్ లా, ఖురాన్ లా, భగవద్గీతలా ఎంతో పవిత్రంగా చూస్తాను అని జగన్ చెప్పారు. కానీ, ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి? మద్యం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి జగన్ నాడు ఏం చెప్పారు? నేడు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్లను జగన్ వచ్చాక మొత్తంగా తీసేశారు. కొత్త బ్రాండ్లను మార్కెట్ లోకి తెచ్చారు. ఈ బ్రాండ్లను తయారు చేసే వారు ఎవరో కాదు. వారంతా జగన్ అనుచరులే.

బెదిరించి మరీ లాక్కున్నారు..
అధికార పార్టీలో ఉన్న కొందరు ముఖ్య నేతలు.. ఇంతకుముందు ఉన్న మద్యం సంస్థల యాజమాన్యాలను బెదిరించి వారి నుంచి కంపెనీలను లాక్కుని పేర్లు మార్చి ఈ కంపెనీలను నడుపుతున్నారు. ఓ మద్యం కంపెనీ యజమాని తన కంపెనీని మీకు ఇవ్వను అని చెప్పినందుకు వాళ్ల కంపెనీ తయారు చేస్తున్న మద్యాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. అంటే ఆ యజమాని ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాడో చూడాలి.

Also Read..TDP- Janasena: జనసేన, టీడీపీ పొత్తు.. ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి?

శవాల మీద పేలాలా?
2019 సంవత్సరానికి ఆనాడు మద్యం మీద రాష్ట్రానికి వస్తున్న ఆదాయం రూ.16 నుంచి రూ.18వేల కోట్లు. కానీ, ఇవాళ ఆదాయం చూసుకున్నట్లు అయితే.. రూ.32వేల కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రానికి వస్తోంది. ఒక పక్క కుటుంబాలు కూలిపోయినా పర్లేదు, నాశనం అయిపోయినా పర్లేదు.. కానీ, చేయూత ఇవ్వాలి. తన ఓటు బ్యాంకుని పదిలపరుచుకోవడానికి ఇవాళ ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం అనేది, కుటుంబాలను నాశనం చేయడం అనేది ఇది శవాల మీద పేలాలు ఏరుకోవడం కాదా?” అని సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు పురంధేశ్వరి.