Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఉరుములు, పిడుగులతో వర్షాలు
పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఓ పక్క ఎండ తీవ్రత, మరోవైపు పిడుగుపాటు సంభవించే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమై ఉండి పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండడంతో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
Also Read: ఆర్‌సీబీ కెప్టెన్ రజత్‌కు హర్భజన్ సింగ్ వార్నింగ్.. ఎందుకంటే?
శనివారం శ్రీసత్యసాయి జిల్లా ఒరవోయ్ లో 34మిమీ, వైఎస్సార్ జిల్లా నల్లచెరువుపల్లి 27మిమీ, ముద్దనూరు లో 19.7మిమీ, కర్నూలు జిల్లా వెల్దుర్తిలో 18.7మిమీ వర్షపాతం, 17 ప్రాంతాల్లో 10మిమీ కు పైగా వర్షపాతం నమోదైందన్నారు.
మరోవైపు ఆదివారం మన్యం జిల్లాలోని పాలకొండ, సీతంపేట, అల్లూరి జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం,
ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
శనివారం కర్నూలు జిల్లా ఆస్పరి, శ్రీ సత్యసాయి జిల్లా తొగరకుంటలో 40.3°C, చిత్తూరు జిల్లా నిండ్ర, నంద్యాల జిల్లా చాగలమర్రి, వైఎస్సార్ జిల్లా మద్దూరులో 39.8°C గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.